Vintage Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. ఈ ఐపీఎల్ 18వ సీజన్ మార్చ్ 22 నుండి మే 25 వరకు జరుగుతుంది. ఇందులో 74 మ్యాచ్లు 65 రోజులపాటు జరుగుతాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోటీ ఉంటుంది.
Also Read: SA vs ENG: సౌత్ ఆఫ్రికా కు అగ్ని పరీక్ష.. గెలవకపోతే ఇంటికేనా?
ఇక ఫైనల్ మ్యాచ్ కి కూడా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ 18వ సీజన్ ఆరంభానికి మరో 21 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆయా ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఆటగాళ్లను రప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ టీం కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చునని అంతా భావిస్తున్నారు.
అయితే ఈసారి కూడా ధోని బీభత్సం సృష్టించడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సీజన్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ధోని. అయితే ఈ క్రమంలో ధోని ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాట్ బరువును తగ్గించుకుంటున్నాడు. సాధారణంగా ధోని వినియోగించే బ్యాట్ బరువు 125 నుండి 1300 గ్రాములు ఉంటుంది. కానీ ఈసారి బ్యాట్ బరువును 10 – 20 గ్రాములు తగ్గించుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రాక్టీస్ సెషన్ లో మహేంద్రసింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్ పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది సీఎస్కే. ఈ వీడియో చూసిన చెన్నై అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్ కి సంబంధించిన సిక్సర్ల వీడియోని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
Also Read: Danni Wyatt on Virat: కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో.. ఇంగ్లాడ్ ప్లేయర్ సంచలనం ?
ఇక ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. మార్చి 23న చెపాక్ స్టేడియంలో ఈ ఇరుజట్ల మధ్య పోటీ జరగనుంది. ఇక సీఎస్కే షేర్ చేసిన వీడియోలోని ప్రాక్టీస్ సెషన్ లో మహేంద్రసింగ్ ధోని తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. తనదైన ఆటతీరుతో ప్రాక్టీస్ మ్యాచ్ కే వన్నెతెచ్చాడు. యార్కర్ బంతులను హెలిక్యాప్టర్ షాట్ తో సిక్సర్లుగా మలచడం ధోనీ ప్రత్యేకం. తన కెరీర్ లో ఎన్నో గొప్ప సిక్సులు కొట్టిన ధోని.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో సిక్స్ తో అలరించాడు. ఈ సిక్స్ చూసిన అభిమానులు ఖుషి అవుతున్నారు. “వింటేజ్ ధోని కమింగ్ సూన్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
MS Dhoni’s First Practice Session of The Season 💛 pic.twitter.com/7l48MEUjMC
— Junaid Khan (@JunaidKhanation) February 28, 2025