Kannappa Update: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న చిత్రం కన్నప్ప (Kannappa). మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం భాగమైన విషయం తెలిసిందే. భక్త కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో అక్షయ్ కుమార్ (Akshay kumar) తో పాటు ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), బ్రహ్మానందం (Brahmandam), మోహన్ లాల్ (Mohanlal)తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ.200కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహన్ బాబు (Mohan babu) ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా.. ఆయన కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే కాజల్, శరత్ కుమార్, మోహన్ లాల్, మంచు విష్ణు, మోహన్ బాబు వంటి వారి పాత్రలను పరిచయం చేయగా.. ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రను కూడా పరిచయం చేయడం జరిగింది.
శివుడి పాత్రలో అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శివుడిగా ఆయన లుక్ ని విడుదల చేశారు. అందులో త్రిశూలం ఎక్కు పెట్టి విజృంభిస్తున్న శివుడిగా అక్షయ్ కుమార్ లుక్ చాలా అదిరిపోయింది. దీంతో సినిమాపై అంచనాలను కూడా పెంచుతోంది. “ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు” అనే క్యాప్షన్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ..” కన్నప్పలో దైవత్వం, శక్తి, ప్రశాంతతకి ఆకర్షణీయమైన ఉనికికి కేరాఫ్ అయిన శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. అచంచలమైన ప్రేమ, భక్తి, త్యాగానికి సంబంధించిన యుగయుగాలుగా ఉన్న కథలోకి ప్రవేశించండి” అంటూ చిత్రబృందం తెలిపింది. ఇక ఈ ఏప్రిల్ లో పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతోంది.కన్నప్పలో శివుడి పాత్రలు నటించడం పట్ల అక్షయ్ కుమార్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది దైవత్వంతో కూడిన సినిమా అంటూ తెలిపారు.
కన్నప్పలో నటిస్తున్న భారీ తారాగణం..
మంచు ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ సినిమాగా వస్తున్న కన్నప్పను ఎలాగైనా హిట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న స్టార్ కాస్ట్ ను రంగంలోకి దింపుతున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, మలయాళ సినీ ఇండస్ట్రీ నుండి మోహన్లాల్ వంటి స్టార్స్ ను ఈ సినిమా కోసం రంగంలోకి దింపడం గమనార్హం. ఇకపోతే ఇప్పుడు అక్షయ్ కుమార్ ఇందులో శివుడి పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేయగా.. కాజల్ అగర్వాల్ పార్వతీ పాత్రలో నటిస్తున్నట్లు రివిల్ చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ (Mukhesh Kumar singh)దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అలాగే మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానా కూడా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక వీరితోపాటు సప్తగిరి, అర్పిత్ రాంక,రఘుబాబు, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, ఐశ్వర్య, ముఖేష్ ఋషి, దేవరాజు, మధుబాల,ప్రీతి ముకుందన్ వంటి పలువురు స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో భాగమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు.
Stepping into the sacred aura of Mahadev for #Kannappa🏹. Honored to bring this epic tale to life. May Lord Shiva guide us on this divine journey. Om Namah Shivaya!#LordShivaॐ #HarHarMahadevॐ pic.twitter.com/OclB6u18TH
— Akshay Kumar (@akshaykumar) January 20, 2025