BigTV English

Karan Johar: డైరెక్టర్ ని నమ్మితే.. లాజిక్ వెతకరు. జక్కన్న పై కరణ్ ఊహించని కామెంట్స్..!

Karan Johar: డైరెక్టర్ ని నమ్మితే.. లాజిక్ వెతకరు. జక్కన్న పై కరణ్ ఊహించని కామెంట్స్..!

Karan Johar:బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ (Karan Johar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఈయన.. ఎక్కువగా స్టార్ కిడ్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇకపోతే కరణ్ జోహార్ సినిమాల విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటారో.. బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. అందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక విషయంపై చర్చించి వార్తల్లో నిలుస్తూ ఉండే ఈయన.. తాజాగా ఒక సినిమా హిట్ అవ్వడం గురించి అలాగే రాజమౌళి (Rajamouli) గురించి, డైరెక్టర్స్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాల గురించి కూడా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు.


సినిమాలో లాజిక్ వెతక్కూడదు.. ఎంజాయ్ చేయాలంతే -కరణ్ జోహార్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ మాట్లాడుతూ..” మనం తీసిన సినిమాపై మనకు నమ్మకం ఉంటే, ప్రేక్షకులు ఆ సినిమాలో లాజిక్ గురించి పట్టించుకోరు. ఉదాహరణకు మనం రాజమౌళి సినిమాలు తీసుకుంటే ఆయన చిత్రాలలో లాజిక్ గురించి ఎప్పుడు ప్రేక్షకులు మాట్లాడలేదు. దానికి కారణం వారికి ఆయన కథ పైన ఉన్న నమ్మకమే. ఎలాంటి సన్నివేశాలనైనా సరే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించగలడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’చిత్రం మాత్రమే కాకుండా ‘యానిమల్’, ‘గదర్’ వంటి చిత్రాలకు కూడా ఇదే అంశం వర్తిస్తుంది. ఈ సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఆయా దర్శకులపై ప్రజలలో ఉన్న నమ్మకమే అని చెప్పవచ్చు. ఇక గదర్ 2 లో హీరో 1000 మందిని కొడుతున్నట్లు చూపించారు. మరి అది సాధ్యమా? కాదా?!అని ఎవరు కూడా చూడలేదు. కారణం దర్శకుల పైన ఉన్న నమ్మకమే. ఇక సన్నీ దేవోల్ ఏదైనా చేయగలడని దర్శకుడు అనిల్ శర్మ (Anil Sharma) నమ్మారు కాబట్టే దానిని ఆయన తెరపై చూపించారు. ఇక దీనినే అటు ప్రేక్షకులు కూడా నమ్మారు. ఫలితంగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే సినిమా విజయం అనేది పూర్తిగా నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. లాజిక్ గురించి ఆలోచించినా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి సినిమాను ఎంజాయ్ చేస్తూ చూడాలి” అంటూ కరణ్ జోహార్ తెలిపారు. ఇక ప్రస్తుతం కరణ్ జోహార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


కరణ్ జోహార్ కెరియర్..

కరణ్ జోహార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు మంచి హోస్ట్ కూడా.. “కాఫీ విత్ కరణ్ ” అనే షోకి హోస్టుగా వ్యవహరిస్తూ.. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో, హీరోయిన్లను మొదలుకొని సౌత్ హీరో , హీరోయిన్లను ఇంటర్వ్యూ చేసి వారి పర్సనల్ విషయాలను కూడా బయటకు లాగే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సమంత వ్యక్తిగత విషయాలను కూడా బయటకు తీసి, అప్పుడప్పుడు నెగిటివిటీ కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా కరణ్ జోహార్ అటు యాడ్స్ కూడా చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×