OTT Movie : ‘అప్పు’ ఇది చాలా ప్రమాదకరమైనది. చేసేటప్పుడు బాగానే ఉన్నా, ఇచ్చేటప్పుడు కష్టంగా ఉంటుంది. కొంతమంది చెల్లించటానికి ఇబ్బందులు పడుతుంటారు. మరి కొంతమంది డబ్బులు ఉన్నా కూడా అప్పు చెల్లించడానికి వెనకాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక మంచి వ్యక్తి, అప్పు చేసిన పాపానికి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. నిజానికి ఆ డబ్బును తన స్నేహితుడే తీసుకుని పరార్ అయిపోతాడు. ఈ మూవీ విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఇరానియన్ మూవీ పేరు ‘ఎ హీరో’ (A Hero). 2021 లో రిలీజ్ అయిన ఈ మూవీకి అస్గర్ ఫర్హాదీ దర్శకత్వం వహించారు. ఇందులో అమీర్ జాడిది, మొహ్సేన్ తనబండే, సహర్ గోల్‌డూస్ట్ నటించారు. ఈ చిత్రం 2021 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పామ్ డి ఓర్ పోటీకి అవ్వడంతో పాటు గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకుంది. ఇది 94వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌కి ఇరానియన్ ఎంట్రీగా ఎంపిక చేయబడింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
రహీమ్ తాను చేసిన అప్పును తీర్చలేక జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఇరాన్ దేశంలో అప్పు చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అప్పు తీర్చలేక పోవడంతో తను జైల్లో ఉంటాడు. నిజానికి తీసుకున్న అప్పు మరొక వ్యక్తి తీసుకొని పరార్ అయిపోతాడు. బిజినెస్ చేద్దామన్న ఆలోచనతోనే హీరో అప్పు చేసి ఉంటాడు. ఇలా జరగడంతో అప్పు తీర్చలేక జైలుకు వెళ్తాడు. రెండు రోజులు బెయిల్ రావడంతో తన బావ దగ్గరికి వస్తాడు. నిజానికి అతని బావ కూడా పేదరికంలోనే ఉంటాడు. పైగా జైలుకు వెళ్లిన రహీం కొడుకుని కూడా అతనే చూసుకోవాల్సి వస్తుంది. రహీం కి కొన్ని కారణాలవల్ల భార్యతో విడాకులు అవుతాయి. ఒకరోజు చేసిన అప్పులో, సగం డబ్బులు అడ్జస్ట్ అయ్యాయని బావతో చెప్తాడు. మిగతా సగానికి ఇన్స్టాల్మెంట్స్ కడతానని, అప్పు ఇచ్చిన వాడితో మాట్లాడాలని బావతో చెప్తాడు. అందుకు అతను సరేనని చెప్పి అప్పు ఇచ్చిన వ్యక్తితో ఈ డీల్ కి ఒప్పిస్తాడు. నిజానికి అతని దగ్గర సగం డబ్బులు కూడా ఉండవు. తన స్నేహితురాలికి కొన్ని గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి. వాటిని రహీం కి ఇస్తే కాస్త సమస్య అయినా తగ్గుతుంది అనుకుంటుంది. అలా దాని ఖరీదు కూడా తన అప్పులో సగం వరకు ఉంటుంది. అయితే రహీం కి ఇలా చేయడం మంచిది కాదనిపిస్తుంది.
కాయిన్స్ పోగొట్టుకున్నవాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నారో అనుకుంటూ వెనకడుగు వేస్తాడు. ఆ కాయిన్స్ పోగొట్టుకున్న వాళ్లు, ఆ కాయిన్స్ తీసుకోవచ్చని ఒక ఫోన్ నెంబర్ కూడా వేసి పోస్టర్లు అంటిస్తాడు రహీమ్. రెండు రోజులు గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లిపోతాడు రహీమ్. ఆ తర్వాత ఆ నెంబర్ కి ఒక మహిళ కాల్ చేస్తుంది. ఆ మహిళకి తన వాళ్ళ దగ్గర గోల్డ్ కాయిన్స్ తీసుకోమని చెప్తాడు. అలా ఆమె ఆ కాయిన్స్ ను తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ విషయం పోలీసులకు తెలుసి, అతని మంచి మనసును వైరల్ చేయాలనుకుంటారు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితం జైల్లో ఒక వ్యక్తి అనుమానస్పదంగా చనిపోయి ఉంటాడు. ఆ జైల్లో పోలీసులకు ఈ విషయంపై చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు రహీమ్ చేసిన మంచి పనితో, ఆ విషయాన్ని మరిపించాలనుకుంటారు. పోలీసులు అతని వీడియోని తీసి వైరల్ చేస్తారు. చివరికి రహీమ్ ఈ కేసు నుంచి బయటపడతాడా? మరెవరైనా రహీం కి సాయం చేస్తారా? అతడు జైల్లోనే గడపాల్సి వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.