East Godawari News: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పెద్దలు పదే పదే హెచ్చరిస్తారు. ఒక్కసారి అడెక్ట్ అయితే ఆ ఊబి నుంచి బయటకు రాలేమని అంటుంటారు. దాన్ని బయట పడలేక ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. అలాంటి ఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.
కనిపిస్తున్న వ్యక్తి పేరు సతీష్. వృత్తి తాపీమేస్త్రి.. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు. నాలుగు డబ్బులు వచ్చినప్పుడు ఎవరైనా వెనుకేసుకుంటారు. ఇతగాడు మాత్రం ఫ్రెండ్స్ మాటలు బాగా విన్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశ.. నిలువునా ముంచేసింది. ఓ వైపు తాపీమేస్తి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులో ఆన్‌లైన్‌లో బెట్టింగులు ఆడడం మొదలుపెట్టాడు.
మొదట్లో డబ్బులు బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఆ గేమ్‌కు అలవాటు పడ్డాయి. పనులకు వెళ్లినా నిత్యం బెట్టింగులు ఆడేవాడు. చివరకు బానిసయ్యాడు. ఇంకేముంది.. అన్నీ కోల్పోయిన తర్వాత చివరకు తెలుసుకున్నాడు. బెట్టింగ్ విషయం ఇంట్లో వారికి చెప్పలేక మనసులో పెట్టేసుకున్నాడు. ఎవరికైనా చెబితే సలహాలు ఇచ్చేవారేమో. అదీ కూడా చెయ్యలేదు.
ఫలితంగా ఆదివారం కొవ్వూరులోని పేరుపాలెం బీచ్‌కు వచ్చాడు సతీష్. ‘తమ్ముడు అందరూ తనను క్షమించండి’ అంటూ సెల్ఫీ వీడియో ఒకటి కుటుంబసభ్యులకు పంపాడు. ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాడు పడి మొత్తం నాశనం అయ్యానంటూ తన గోడు వెల్లబోసున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, బెట్టింగ్ మానుకోలేకపోతున్నానని, అలాగని ఉండలేకపోతున్నానని అందులో పేర్కొన్నారు.
ALSO READ: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి హత్య – పట్టపగలే దారుణం
ఇలాంటి పరిస్థితుల్లో తాను బతికి ఉండడం అనవసరమని భావించాడు. పిల్లలు జాగ్రత్త.. ఐయామ్ సారీ, అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పేరు పాలెం బీచ్ లో పోలీసులు గాలింపు చేపట్టారు. సతీష్ బంధువులు బీచ్ లో ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.
సతీష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సెల్ఫీ వీడియో చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎందుకు ఇలాంటి పని చేశాడని అంటున్నారు. బెట్టింగుల విషయం ఇంట్లో చెప్పినా బాగుండేదని అంటున్నారు. పిల్లలు అనాధలు అయ్యారంటూ వాపోతున్నారు. సతీష్ పిల్లలను చూసి చాలామంది కంట తడి పెట్టుకున్నారు. ఇలాంటి కష్ట పగవాడికి రాకూడదని అంటున్నారు.
ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి. ఒకప్పుడు కోడిపందాలు, పేకాట, తాగుడు ఉండకూడదని పెద్దలు తరచూ చెబుతుండేవారు. టెక్నాలజీ పుణ్యమాని ఈ వ్యసనం.. స్మార్ట్ ఫోన్లకు వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇంటర్ నెట్ లేనివారు సమీపంలోని రైల్వేస్టేషన్లకు వెళ్లి మరీ బెట్టింగులు ఆడుతున్నారు. ఇలాంటి విషయాల్లో పెద్దలు.. పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే కష్టాలు తప్పవని అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త.
ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం.. చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీమేస్త్రీ సతీష్
తమ్ముడూ.. అందరూ నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో
ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల మొత్తం నాశనమైంది.. ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన pic.twitter.com/8tWdVzPmdP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2025