AP EAPCET-2025: ఏపీ ఈఏపీసెట్-2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. కాసేపటి క్రితమే కాకినాడ జేఎన్టీయూలో వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మే 19 నుంచి 27 తేదీల మధ్య ఈఏపీసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎంట్రన్స్ పరీక్షలకు మొత్తం 3లక్షల 40వేల 300 మంది విద్యార్థులు హాజరయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఎంటన్స్ ఎగ్జామ్ లో మొత్తం 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ప్రభుత్వం ఈ ఫలితాలను విడుదల చేయడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే హైదరాబాద్‌లో మొత్తంగా 145 కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 3లక్షల 62వేల 448మంది అప్లై చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 3లక్షల 40వేల 300మంది ఎగ్జామ్ కు హాజరైనట్లు వెల్లడించారు. వీరిలో 2లక్షల 57వేల 509మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారని వివరించారు పరీక్షలు నిర్వహించిన తక్కువ కాల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం పట్ల వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎగ్జామ్ లను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ALSO READ: DRDO: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56,100 జీతం, ఇంకా 2 రోజులే?
గడిచిన నెల.. మే 19 నుంచి 20వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి నాలుగు సెషన్లలో మొత్తం పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు విభాగాలకు సంబంధించి మొత్తం 75వేల 460మంది విద్యార్థులు ఎగ్జామ్ కు హాజరయ్యినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 67వేల761మంది (89.80శాతం) అర్హత సాధించారని తెలిపారు. అలాగే, మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి 10 సెషన్లలో జరిగిన పరీక్షకు 2లక్షల 64వేల 840మంది విద్యార్థులు హాజరు అయ్యారు. వీరిలో 1లక్ష 89వేల 748మంది (71.65శాతం) అర్హత సాధించినట్టు అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: DRDO: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56,100 జీతం, ఇంకా 2 రోజులే?