BigTV English
Advertisement

Spirit Update : ‘స్పిరిట్’లో ఆ ఇద్దరు హీరోయిన్లు… ‘దేవర’ విలన్ కూడా

Spirit Update : ‘స్పిరిట్’లో ఆ ఇద్దరు హీరోయిన్లు… ‘దేవర’ విలన్ కూడా

Spirit Update : కబీర్ సింగ్, యానిమల్ వంటి బిగ్గెస్ట్ హిట్స్ ఖాతాలో వేసుకున్న మోస్ట్ వయోలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఆయన దర్శకత్వం వహించబోతున్న మూడవ సినిమా ‘స్పిరిట్’ (Spirit ) కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అంటూ ముగ్గురు పాపులర్ సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి.


ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి ప్రభాస్ ఈ మూవీతో హర్రర్ జానర్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే, ఆ తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2025 ప్రధమార్ధంలో ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ 2026లో రిలీజ్ కాబోతోంది.

ఈ కాప్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతున్నట్టుగా సమాచారం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు నిర్మాత భూషణ్ కుమార్ ‘స్పిరిట్’లో ఫిమేల్ లీడ్ గా మృణాల్ ఠాకూర్ టో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో నెగిటివ్ రోల్ కోసం ‘దేవర’ విలన్ సైఫ్ అలీ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ‘స్పిరిట్’ సినిమాలో రియల్ లైఫ్ దంపతులు సైఫ్ అలీ ఖాన్,  కరీనా కపూర్ ఇద్దరూ భాగం కాబోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవి నిజమేనని తెలుస్తోంది. ఇప్పటికే మృణాల్ తో పాటు కరీనా, సైఫ్ తమ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రెమ్యూనరేషన్ కు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి అంటున్నారు.


మొత్తానికి సందీప్ రెడ్డి వంగా ఈ ప్రాజెక్టు లో మృణాల్ ఠాకూర్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దంపతులలో పాటు పలువురు పెద్ద స్టార్ కాస్ట్ ను యాడ్ చేయడం సినిమాపై మరింత హైప్ పెంచేస్తోంది. ఇక మృణాల్ కు ఇదే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అవుతుంది. అయితే కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతులు ఒక సినిమాలో జంటగా నెగిటివ్ గా నటించడం ఇదే మొదటిసారి. అలాగే వీళ్ళిద్దరి యాక్షన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా చూపించబోయే మోస్ట్ వయోలెంట్ యాటిట్యూడ్ లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ‘స్పిరిట్’ (Spirit) సినిమాను భూషణ్ కుమార్ – సందీప్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్ పార్క్’ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×