Karishma Kapoor.. ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు కొంతమంది కరెక్ట్ వయసులో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే, మరికొంతమంది కెరియర్ పై ఫోకస్ పెట్టి, పెళ్లీడు వయసు కాస్త దాటిపోయిన తర్వాత పెళ్లికి సిద్ధమవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరికొంతమంది ఆరు పదుల వయసు దాటినా.. పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకొని ఇప్పుడు మళ్ళీ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు 49 సంవత్సరాల వయసులో పెళ్లికి సిద్ధం అవుతున్నానంటూ ఒక బాలీవుడ్ హీరోయిన్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం తెలిసి వృద్ధాప్యంలో పెళ్లి ఏంటి అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు మరి ఆమె ఎవరు.. అతను చేసుకోబోయే వాడు ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
సంజయ్ తో విడాకులు..
90లలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని సూపర్ హిట్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది కరిష్మా కపూర్ (Karishma Kapoor) ఎన్నో హిట్ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులను ఎప్పుడు పలకరిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా కరిష్మా కపూర్ వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బుల్లితెరపై కూడా పాపులారిటీ అయిన ఈ ముద్దుగుమ్మ నిజజీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికీ సరైన వ్యక్తిని తన భాగస్వామిగా చేసుకోలేకపోయింది. గతంలో కరిష్మా వ్యాపారవేత్త ఆయన సంజయ్ ను వివాహం చేసుకుంది. కానీ కొన్నాళ్లకే అతనితో విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు విడాకులైన చాలా కాలం తర్వాత మళ్ళీ వివాహం అంటూ వార్తల్లో నిలిచింది కరిష్మా కపూర్.
సందీప్ తో కరిష్మా ప్రేమలో పడిందా..
అసలు విషయంలోకెళితే.. సంజయ్ కూపర్ తో విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఒంటరిగా జీవితాన్ని సాగిస్తోంది. ఇప్పుడు పిల్లలు కూడా పెరిగారు. దీంతో ఇప్పుడు మనసులో జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుందో ఏమో కానీ ఢిల్లీ వ్యాపారవేత్త అయిన సందీప్ తోష్నివాల్ తో ఏడు అడుగులు వేయడానికి సిద్ధమయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే కరిష్మాను అతడు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో లేదో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
పెళ్లి వార్తలపై కరిష్మా తండ్రి క్లారిటీ..
ఇదిలా ఉండగా కరిష్మా కపూర్ తండ్రి బాలీవుడ్ నటుడు రణధీర్ కపూర్ మాత్రం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”: కరిష్మా తన కెరియర్లో స్థిరపడే ఆలోచన చేయడం లేదు. సంజయ్ నుండి ఆమె విడాకులు తీసుకున్న తర్వాత సందీప్ తోష్నివాల్ తో ప్రేమలో పడింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కరిష్మా విడాకులు తీసుకున్న తర్వాత.. సందీప్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ వార్తలలో నిజం లేదు. ఆమె తన పిల్లలిద్దరిని మంచిగా పెంచాలని కోరుకుంటుంది. అందుకే తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించాలని అనుకోవడం లేదు. సందీప్ , కరిష్మా స్నేహితుడు మాత్రమే. వారు బయటకు వెళ్లినా పర్వాలేదు కానీ ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉంది” అంటూ కరిష్మా కపూర్ తండ్రి తెలిపారు.