BigTV English

SA vs ENG: సౌత్ ఆఫ్రికా కు అగ్ని పరీక్ష.. గెలవకపోతే ఇంటికేనా?

SA vs ENG: సౌత్ ఆఫ్రికా కు అగ్ని పరీక్ష.. గెలవకపోతే ఇంటికేనా?

SA vs ENG: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా గ్రూప్ – బి లో నేడు చివరి మ్యాచ్ జరగబోతోంది. సౌత్ ఆఫ్రికా – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కి కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియం వేదికగా మారనుంది. శుక్రవారం రోజు జరిగిన కీలక ఆఫ్గనిస్తాన్ – ఆస్ట్రేలియా మ్యాచ్ లో వర్షం పడడం వల్ల ఫలితం నిర్ణయించలేదు. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ ని కేటాయించడం వల్ల ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీస్ కి అర్హత సాధించింది.


 

ఇక ఆఫ్గనిస్తాన్ మాత్రం దాదాపు టోర్నీ నుండి నిష్క్రమించే పరిస్థితిలో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కి ఇంకా సెమీఫైనల్ కి చేరే అవకాశాలు కాస్త ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. సౌత్ ఆఫ్రికా జట్టు సెమీస్ కి చేరువలో ఉంది. నేడు {ICC Champions Trophy} జరగబోయే సౌత్ ఆఫ్రికా – ఇంగ్లాండ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా జట్టు దారుణంగా ఓడిపోతే.. ఆఫ్ఘనిస్తాన్ కి సెమీస్ కి చేరే అవకాశాలు ఉంటాయి.


ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికా ను207 పరుగుల తేడాతో ఓడించాలి. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన టార్గెట్ ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 11.1 ఓవర్లలోనే ఛేదించాలి. ఇలాంటి సందర్భాల్లోనే ఆఫ్గనిస్తాన్ కి సెమిస్ చేరే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇంగ్లాండ్ పై నామమాత్రంగా మ్యాచ్ ఓడినా.. సౌత్ ఆఫ్రికా సెమిస్ చేరుకుంటుంది. అయితే వర్షం కారణంగా ఒకవేళ ఈ మ్యాచ్ కూడా రద్దు అయితే సౌత్ ఆఫ్రికా సులభంగా సెమిస్ కి చేరుకుంటుంది.

ఎటు చూసినా ఈరోజు మ్యాచ్ అనంతరం సౌత్ ఆఫ్రికా జట్టుకే సెమిస్ చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రూప్ – బి లో మూడు పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా.. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ లో చేరాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓడిపోయి సెమీస్ రేసు నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్.. ఈ చివరి మ్యాచ్ లోనైనా గెలవాలని ఆరాటపడుతుంది.

 

అయితే సౌత్ ఆఫ్రికా – ఇంగ్లాండ్ జట్లు వన్డే ఫార్మాట్ లో ఇప్పటివరకు 70 సార్లు తలపడ్డాయి. ఈ 70 మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికా జట్టే పై చేయిగా నిలిచింది. సౌత్ ఆఫ్రికా 34 మ్యాచ్లలో గెలుపొందగా.. ఇంగ్లాండ్ 30 మ్యాచ్లలో విజయం సాధించింది. అలాగే ఇందులో ఒక మ్యాచ్ డ్రా కాగా.. ఐదు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ {ICC Champions Trophy} హిస్టరీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లాండ్ రెండుసార్లు, సౌత్ ఆఫ్రికా రెండుసార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు చివరగా 2013 ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఆడగా.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు ఘనవిజయం సాధించింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×