BigTV English

Vantalakka:వావ్ వంటలక్క భర్త ఇంత టాలెంటెడా?

Vantalakka:వావ్ వంటలక్క భర్త ఇంత టాలెంటెడా?

Karthikadeepam daily seriol actress told about her Husband
టీవీ సీరియల్స్ లోనే ఓ సంచలనం అని చెప్పుకునే కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులరో తెలిసిందే. ముఖ్యంగా వెనకటి రోజుల్లో శోభన్ బాబు, శ్రీదేవి, శారద కాంబినేషన్ లో వచ్చిన కార్తీక దీపం సినిమా ఎంత సూపర్ హిట్టయ్యిందో అంతకు మించి ఈ డైలీ సీరియల్ హిట్టయ్యింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప పడుతున్న కష్టాలను చూసి టీవీలు చూస్తూనే కంట తడి పెట్టుకునేవారు కొందరు మహిళలు. అంతగా జనాదరణ పొందిన డైలీ సీరియల్ ఈ మధ్య కాలంలో ఏదీ లేదంటే అతి శకయోక్తి కాదు. దూరదర్శన్ లో రుతురాగాలు తర్వాత మళ్లీ అంతటి పేరు సంపాదించుకుంది కార్తీక దీపం. అయితే ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర కన్నా కూడా దీప పాత్రకే బాగా గుర్తింపు వచ్చింది ఎక్కడికి వెళ్లినా ఆమె అసలు పేరు మర్చిపోయి దీపా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు.


అసలు పేరు ప్రేమి

అయితే వంటలక్క ఇలియాస్ దీప పాపులారిటీ సంపాదించుకున్న ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాథన్. వంటలక్క భర్త పేరు వినీత్ భట్. అయితే ఇతని గురించి చాలా మందికి తెలియదు. ఇతను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడే. మలయాళంలో పలు సీరియల్స్, సినిమాలు ప్రొడ్యూస్ చేసి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. మల్టీ ట్యాలెంటెడ్ కూడా. జ్యోతిష్య శాస్త్రంలోనూ మంచి పట్టు ఉంది. అంతేకాదు 2017 పంవత్సరంలో బెస్ట్ ఆస్త్రాలజర్ గా సన్మానాలు కూడా అందుకున్నారు. వంటలక్కకు పెళ్లీడు వచ్చిన కొడుకు ఉన్నాడన్న సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో తన కుమారుడి ఫొటోలు పెట్టింది వంటలక్క. ఈమెకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వంటలక్క కార్తీక దీపం -2 సీరియల్ చేస్తూ బిజీగా ఉంది. డాక్టర్ బాబుతోనే జతకట్టడంతో ఈ జంట హిట్ పెయిర్ గా అందరూ చెప్పుకుంటున్నారు.


ప్రేమతో చూసుకునే భర్త

తన బర్త వినీత్ భట్ గురించి చెబుతూ వంటలక్క ఇలా అంటోంది. తన ఇష్టాన్ని ఎప్పుడూ వినీత్ కాదనడని..తన ఎదుగుదలకు కారణం ఆయనే అంటోంది భార్యకు సమాజంలో పేరు వస్తే సహించలేరు కొందరు భర్తలు. కానీ తన భర్త అందరిలాంటి వాడు కాదని..తనని ప్రేమగా అర్థం చేసుకుంటారని అంటోంది. ఇలాంటి భర్త దొరకడం నిజంగా తన లక్కీ అంటోంది. అయితే వంటలక్క తన భర్తతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. అందరూ వంటలక్క భర్త ఎలా ఉన్నాడో అని ఆసక్తిగా చూశారు. క్షణాలలో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా చాలా బాగున్నారని ..వీళ్ల జంటకు తమ ఆశీస్సులు అంటూ పోస్టులు పెడుతున్నారు. సీరియల్ లో కష్టాలు పడ్డా నిజ జీవితంలో మీరు హ్యాపీగా ఉన్నారు మాకు అదే చాలు అని కొందరు వంటలక్క అభిమానులు పోస్ట్ పెట్టారు. ఈ జంట నిండు నూరేళ్లు ఇలాగే సంతోషం, సౌభాగ్యంతో ఉండాలని మరో అభిమాని పోస్ట్ పెట్టాడు. మీరు మరిన్ని సీరియల్స్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఆనందపడేలా చేయాలని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×