Katrina Kaif: ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లయినా, పిల్లలు పుట్టినా వారి కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే అని ప్రేక్షకులు అనుకుంటూ ఉండేవారు. కానీ రోజులు చాలా మారిపోయాయి. హీరోయిన్‌కు పెళ్లయినా, పిల్లలు ఉన్నా కూడా సినిమాలకు కమిట్ అవుతూ ఆ కమిట్మెంట్ కోసం కష్టపడుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో మాత్రమే ఈ కల్చర్ ఉండేది. ఇప్పుడు ప్రతీ భాషా పరిశ్రమలో పెళ్లయ్యి, పిల్లలు ఉన్న హీరోయిన్స్‌కు కూడా సినిమా అవకాశాలు అందిస్తున్నారు మేకర్స్. అందుకే ఒక బాలీవుడ్ బ్యూటీ కూడా తనకు పిల్లలు కావాలని దేవుడికి పూజలు చేయడం మొదలుపెట్టిందట. తను మరెవరో కాదు బీ టౌన్ సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్.
పిల్లలు లేరు
సీనియర్ హీరోయిన్ అయిన కత్రినా కైఫ్.. నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ యంగ్ హీరో అయిన విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముందుగా ఒక ఫ్యాన్‌గా కత్రినాకు పరిచయం అయ్యాడు విక్కీ. అసలు విక్కీ కౌశల్ (Vicky Kaushal) స్టార్ అవ్వకముందే తన యాక్టింగ్ అంటే ఇష్టమని స్టేట్‌మెంట్ ఇచ్చింది కత్రినా. అలా వారిద్దరి మధ్య స్నేహం.. ఆపై ప్రేమ మొదలయ్యింది. కానీ వీరి రిలేషన్‌షిప్ గురించి ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులకు తప్పా ప్రేక్షకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పెళ్లి కూడా ఎవ్వరికీ తెలియకుండానే ప్రైవేట్‌గానే చేసుకున్నారు. ఇక పెళ్లయ్యి నాలుగేళ్లు అవుతున్నా వీరికి ఇంకా పిల్లలు లేకపోవడం గురించి చాలామంది ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఎన్నో రూమర్స్
మామూలుగా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ పెళ్లయినా కూడా వెంటనే తను ప్రెగ్నెంట్ అనే రూమర్స్ మొదలయిపోతాయి. అలాగే కత్రినా కైఫ్ కూడా ప్రెగ్నెంట్ అని ఇప్పటికే చాలాసార్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ వరకే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ నిజమయ్యే రోజులు దగ్గర పడ్డాయని బాలీవుడ్ మీడియా అంటోంది. తాజాగా కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించింది కత్రినా కైఫ్. అంతే కాకుండా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే ఈ ప్రత్యేక పూజలు పిల్లలు పుట్టడం కోసమే సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: వాళ్లిద్దరూ అలా ప్రవర్తించారు.. నయన్, విఘ్నేష్‌పై ధనుష్ కొత్త ఆరోపణలు
దానికోసమే పూజలు
కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలోనే రెండురోజుల పాటు ఉంటూ అక్కడ నాగపూజలో పాల్గోనుందట కత్రినా కైఫ్ (Katrina Kaif). కుక్కేలో సర్పాలకు అధిపతి అయిన కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామిగా పూజిస్తుంటారు. సర్ప దోషం ఉన్నవారు, సంతాన ప్రాప్తి కావాలని అనుకునేవారు ఇక్కడికి వచ్చి ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దీంతో కత్రినా కైఫ్ కూడా సంతాన ప్రాప్తి కోసమే ఇక్కడికి వచ్చిందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. కత్రినా కైఫ్ కంటే ముందు, తనతో పాటు పెళ్లి చేసుకున్న ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పుడు పిల్లలతో ఫ్యామిలీని ప్రారంభించారు. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కూడా తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.