Keerthi Suresh : కీర్తి సురేష్ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దాదాపుగా 15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనితో ఈనెల 12వ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసింది. అయితే భర్తతో హ నీమూన్‌కు కూడా వెళ్లకుండా తాను కమిట్ అయిన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొన్నది. ఈ అమ్మడు బాలీవుడ్ లో మేరీ జాన్ అనే మూవీ లో నటించింది. ఆ చిత్ర ప్రమోషన్సలో పాల్గొన్న కీర్తి సురేష్ పై అభిమానులు ప్రశంసలు కురిపించారు.. పెళ్ళైన కొద్ది రోజులకే సినిమాల్లో బిజీగా అయ్యింది. అంతేకాదు ప్రెస్ మీట్ కు తాళి బొట్టును వేసుకొని వచ్చింది. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో చూసాం.. అయితే తాజాగా ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కేరీర్ పీక్స్ లో ఉన్న స్టార్ హీరోయిన్ సినిమాల కు బ్రేక్ ఇవ్వడం జరుగుతుందా..? సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నా సమయంలో సినిమాలకు దూరం అవ్వడం జరుగుతుందా? పాన్ ఇండియా నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా..? అది జరిగే పని కాదు. అయితే నటి కీర్తి సురేష్ విషయం లో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికి స్థాయికి చేరుకున్న ఈ అమ్మడు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. మహానటి మూవీతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. కాగా వివాహం విషయంలో చాలా మంది నటీమణుల కంటే ముందుంది..
కీర్తి సురేష్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. 15 ఏళ్ల నుంచి ప్రేమించిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఆంటోనితో అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేసింది.. అయితే భర్త తో హ నీమూన్‌కు కూడా వెళ్లకుండా తాను కథానాయకిగా నటించిన తొలి హిందీ చిత్రం ‘మేరీ జాన్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. భారీ రెస్పాన్స్ తో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు సైన్ చెయ్యట్లేదనే వార్తలు ఊపందుకున్నాయి.. దాంతో ఈ వార్తలు నిజం అని అభిప్రాయపడుతున్నారు. చేతిలో ఉన్న రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది. కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తీ సురేష్ కొంత కాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు ఉందట.. అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని టాక్.. ఇందులో నిజం ఎంతో అన్నది తెలియాల్సి ఉంది. అయితే కీర్తీ సురేష్ కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవని తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కీర్తి సురేష్ నిజం చెప్పే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..