E-Paper
Advertisement

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. ‘పుష్ప 2’ రికార్డులను రెండు రోజుల్లోనే బ్రేక్ చేసిన ‘యూఐ ది మూవీ’

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. ‘పుష్ప 2’ రికార్డులను రెండు రోజుల్లోనే బ్రేక్ చేసిన ‘యూఐ ది మూవీ’

Pushpa 2: గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలు కలెక్షన్స్ విషయంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే చాలావరకు సౌత్ సినిమాలకు ఈ డిమాండ్ ఉంది. అలాగే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ మధ్య విడుదలయిన మూవీ ‘పుష్ప 2’. హైప్‌కు తగినట్టుగానే చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం వల్ల ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అలా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా రాబట్టింది ‘పుష్ప 2’. కానీ ఆ తర్వాత విడుదలయిన ‘యూఐ ది మూవీ’ రెండురోజుల్లోనే ‘పుష్ప 2’ రికార్డులు బ్రేక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పాన్ ఇండియా పోటీ

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందనా నటించిన సినిమానే ‘పుష్ప 2’. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కాగా ఇప్పటికీ చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. సౌత్‌లో ఈ మూవీకి ఎంత ఆదరణ లభించిందో దానికి సమానంగా నార్త్ ప్రేక్షకులు కూడా దీనిని యాక్సెప్ట్ చేశారు. ఇప్పటికే నార్త్‌లో ‘పుష్ప 2’ (Pushpa 2) రూ.700 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యింది. మంగళవారం వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్స్.. రూ.1526.95 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. కొత్త రిలీజ్‌లు ఎన్ని వచ్చినా కూడా ‘పుష్ప 2’ రన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అలాంటి ఈ సినిమా స్పీడ్‌కు మరొక పాన్ ఇండియా మూవీ బ్రేకులు వేసింది. అదే ‘యూఐ ది మూవీ’.

Also Read: సంధ్య థియేటర్ ఘటనలో రష్మిక మౌనం.. సైలెంట్‌గా సైడ్ అయిపోతుందా.?

ప్రేక్షకులను మెప్పించలేకపోయింది

‘పుష్ప 2’ 17 రోజుల కలెక్షన్స్‌ను రెండురోజుల్లోనే దాటేసింది ‘యూఐ ది మూవీ’. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఉపేంద్ర డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ‘యూఐ ది మూవీ’ డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. కన్నడతో పాటు మొత్తం అయిదు భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళలో ఈ సినిమా చాలామంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అలా కన్నడలో ‘పుష్ప 2’ 17 రోజుల కలెక్షన్స్‌ను రెండు రోజుల్లోనే దాటేయగలిగింది ‘యూఐ ది మూవీ’. కన్నడలో ‘పుష్ప 2’ ఎక్కువమంది ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని స్పష్టంగా తెలుస్తోంది.

రెండు రోజుల్లోనే

‘యూఐ ది మూవీ’ (UI The Movie) విడుదలయినప్పటి నుండి రోజురోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ఉపేంద్రకు కన్నడలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పైగా దాదాపు పదేళ్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో ముందు నుండి ‘యూఐ ది మూవీ’కి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యింది. మొదటిరోజు కన్నడలో ఈ మూవీకి రూ.6.95 కోట్ల కలెక్షన్స్ రాగా.. రెండోరోజుకు అది రూ.13.90 కోట్లుగా పెరిగింది. కానీ ‘పుష్ప 2’ మాత్రం ఇప్పటివరకు కన్నడలో కేవలం రూ.15 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. దీన్ని బట్టి చూస్తే కన్నడలో ‘పుష్ప 2’ డిశాస్టర్‌గా నిలిచిందని అర్థమవుతోంది. కానీ దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతుండడంతో కన్నడ మార్కెట్ గురించి మేకర్స్ దిగులుపడడం లేదని తెలుస్తోంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×