Keerthy Suresh: తన నటనతో విశ్వరూపం చూపించి, ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో మెప్పించే ఈమె.. అంతకుమించి అందంతో, యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. అందరితో అల్లరిగా సరదాగా గడిపే కీర్తి సురేష్ తొలిసారి తన మనసు ముక్కలయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవలే మయన్మార్ లో జరిగిన భూకంపం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ మయన్మార్ భూకంపంలో దాదాపు 1,725 మంది ప్రజలు మృతి చెందినట్లు సమాచారం. దాంతో అక్కడ జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. థాయిలాండ్, మయన్మార్ దేశాలలో భూకంపం సంభవించడంతో అటు ప్రాణ నష్టం తో పాటు ఆస్తి నష్టం కూడా భారీగా ఏర్పడింది.దాంతో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ కూడా మయన్మార్ భూకంపంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ నరకం భరించలేనిది – కీర్తి సురేష్
ఇక తన పోస్టులో కీర్తి సురేష్.. “మయన్మార్ థాయిలాండ్లో భీకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అక్కడ భూకంపం రావడంతో భారీగా ప్రాణ నష్టం తో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ విషయాన్ని , అక్కడ ప్రజల గురించి తలుచుకుంటూ ఉంటే నా గుండె ముక్కలు అయినంత బాధగా ఉంది. గుండె తరుక్కుపోతోంది. అక్కడి పరిస్థితులు త్వరగా కుదుటపడాలి. అక్కడ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కీర్తి సురేష్. ఇక కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ugadi: టాలీవుడ్ స్టార్ హీరోల రాశి ఫలాలు..ఈ ఏడాది ఆయనదే పై చేయి..!
కీర్తి సురేష్ కెరియర్..
ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మొదటి సినిమాతోనే తన అందంతో అమాయకత్వంతో తెలుగు ప్రజల హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు ఇక అయినా సరే తన ప్రయత్నాలను విరమించుకోలేదు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో దివంగత నటీమణి సావిత్రి (Savitri ) బయోపిక్ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి బయోపిక్ చేసి తన నటనతో అబ్బురపరిచింది.అంతేకాదు ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచినందుకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో టైర్ టు హీరోల సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ బిజీగా గడిపేస్తున్న ఈమె.. ఇటీవల వైవాహిక బంధం లోకి కూడా అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు అంటోనీ తట్టిల్ ను కుటుంబ సభ్యుల సహకారంతో ప్రేమ వివాహం చేసుకుంది. ఇక ఈ జంట కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే వివాహం సమయంలో హిందీలో ‘బేబీ జాన్’ అనే సినిమా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తాళిబొట్టు తో హాజరయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.