BigTV English

Ugadi: టాలీవుడ్ స్టార్ హీరోల రాశి ఫలాలు..ఈ ఏడాది ఆయనదే పై చేయి..!

Ugadi: టాలీవుడ్ స్టార్ హీరోల రాశి ఫలాలు..ఈ ఏడాది ఆయనదే పై చేయి..!

Ugadi.. నేడు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే నూతన సంవత్సరాది ఉగాది.. క్రోధి నామ సంవత్సరం నిన్నటితో పూర్తి కాగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నేటితో ప్రారంభం అయింది. ఇకపోతే ఈ కొత్త ఏడాది స్టార్ హీరోల జాతకాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే గడిచిన ఏడాది కాలంలో టాలీవుడ్ లో కొంతమందికి విజయాలు వరిస్తే.. మరికొంతమంది ఇంకా విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త ఉగాది పండుగను పురస్కరించుకొని కొత్త పంచాంగం ఎలా ఉంది? ఆధాయ వ్య, రాజ్య పూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి? కొత్త ఏడాదిలో మన హీరోల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఏ స్టార్ హీరోకి కలిసి వస్తుందో చూద్దాం.


ప్రభాస్ రాశి ఫలాలు..

విశ్వావసు నామ సంవత్సరం కొత్త పంచాంగం ప్రకారం.. ముందుగా ప్రభాస్ (Prabhas) రాశి ఫలాల విషయానికి వస్తే.. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆయన మరింత జోరు మీద ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్, కల్కి 2898AD సీక్వెల్ కల్కి 2 తో పాటూ సలార్ 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకవైపు షూటింగ్ లు మరొకవైపు కొత్త రిలీజ్ లతో ప్రభాస్ ఈ కొత్త సంవత్సరం చాలా జోరు మీద ముందుకు సాగనున్నారు.


మహేష్ బాబు కొత్త ఏడాది జాతకం..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గత ఏడాది ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే పాన్ వరల్డ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఒక గ్లోబ్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కావడం గమనార్హం. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైన మహేష్ బాబు ఈ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా విశ్వావసు సంవత్సరంలో వచ్చే అవకాశం లేనప్పటికీ, ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి రాబోయే అప్డేట్స్ తో ఏడాది మొత్తం మహేష్ బాబు వార్తల్లో నిలుస్తారు. ఇక సినిమా విడుదల కాకపోయినా సరే ఆయన వ్యాపార రంగాలలో ఆదాయాలు రాజ్యపూజ్యం బాగానే ఉన్నట్లు సమాచారం.

రామ్ చరణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా..?

ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమా చేసి నిరాశ పడ్డారు. ప్రస్తుతం బుచ్చి బాబు సన డైరెక్షన్లో పెద్ది సినిమాతో వస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్ పట్టిందల్లా బంగారమే..

అల్లు అర్జున్ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో దిగ్విజయంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మైథాలాజికల్ సినిమాను ప్రకటించారు. అంతకంటే ముందు అట్లీ తో ఒక భారీ సినిమాను చేయబోతున్నారు అల్లు అర్జున్. మొత్తానికి అయితే ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారనున్నారు.

ఎన్టీఆర్ కు కలిసొచ్చినట్టే..

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాతో హిందీలో అడుగుపెట్టబోతున్నాడు. మరొకవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ కు ఏడాది బాగా కలిసి వచ్చినట్లే అని తెలుస్తోంది.

Jr NTR: నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×