Suspicious Death of a Family: ఉగాది పండగ వేళ సత్య సాయి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మడకశిరలో ఇంటిల్లిపాదితో సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో ఓ ఫ్యామిలీ అనంత లోకాలకు చేరుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గాంధీ బజార్‌లో నివాసం ఉండే గోల్డ్ వ్యాపారి కృష్ణా చారి అతని భార్య సరళ.. పిల్లలు సంతోష్, భువనేశ్ చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. పండగ వేళ ఉదయం నుంచి ఎవరూ భయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కిటికీలో నుంచి తొంగి చూశారు. మొత్తం కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల ఇంటిని కూడా పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో మాత్రం సూసైడ్ నోట్ కూడా కనిపించలేదని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఫ్యామిలీ మొత్తం మాస్ సూసైడ్ చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను హాస్తిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత ఈ కుటుంబం నిజంగానే అత్మహత్యకు పాల్పడిందా లేదా అనే దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.