BigTV English

Kerintha: పెళ్లి చేసుకున్న యంగ్ నటుడు.. అమ్మాయి ఎవరంటే..?

Kerintha: పెళ్లి చేసుకున్న యంగ్ నటుడు.. అమ్మాయి ఎవరంటే..?

Kerinthaa.. టాలీవుడ్ యంగ్ హీరో కేరింత (Kerintha )సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విశ్వంత్ (Viswant)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఈయన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి భావన (Bhavana )అనే అమ్మాయితో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. అయితే రహస్యంగా ఆయన వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఆయన పెళ్లి ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విశ్వంత్ ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కింద” ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైం” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.


చడీచప్పుడు కాకుండా వివాహం చేసుకున్న కేరింత హీరో..

ఈ ఏడాది ఆగస్టులో విశ్వంత్, భావనల నిశ్చితార్థం జరగగా.. ఎలాంటి హడావిడి, ముందస్తు ప్రకటన లేకుండానే మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టారు ఈ జంట . ప్రస్తుతం విశ్వంత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారగా… ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ , అభిమానులు , సినీ ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


విశ్వంత్ సినీ ప్రయాణం..

ఇక విశ్వంత్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోటకు చెందిన ఈయన.. కోయంబత్తూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిపోయాడు. చదువుకునే సమయంలోనే దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్ బ్యానర్ లో వచ్చిన కేరింత సినిమాలో విశ్వంత్ కు ఆఫర్ రావడంతో మధ్యలోనే ఇంజనీరింగ్ ఆపేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో విశ్వంత్ నటనకి కూడా మంచి పేరు లభించింది. దీనికి తోడు అవకాశాలు కూడా బాగానే తలుపు తట్టాయి.

విశ్వంత్ నటించిన సినిమాలు..

కేరింత సినిమా తర్వాత మనమంతా, జెర్సీ, ఓ పిట్ట కథ, కథ వెనక కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, తోలుబొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్, బాయ్ ఫ్రెండ్ ఫర్ మైన్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ఆకట్టుకున్నారు విశ్వంత్. ఇకపోతే విశ్వంత్ వివాహం చేసుకున్న అమ్మాయి డీటెయిల్స్ మాత్రం తెలియరాలేదు. మొత్తానికి అయితే ఈ క్యూట్ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. కొత్త బంధంలోకి అడుగు పెట్టాడు విశ్వంత్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

విశ్వంత్ నటిస్తున్న సినిమాలు..

విశ్వంత్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా ఆయన నటిస్తున్నారట. ఏది ఏమైనా ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్ ని వీడి కొత్త బంధంలోకి అడుగు పెట్టారు ఇక వైవాహిక బంధం తర్వాత ఆయన మరికొన్ని అవకాశాలు అందుకొని మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×