BigTV English

Raveena Tandon: రవీనా టాండన్‌పై దాడి.. కొట్టవద్దని వేడుకున్న కేజీఎఫ్ నటి.. వీడియో వైరల్

Raveena Tandon: రవీనా టాండన్‌పై దాడి.. కొట్టవద్దని వేడుకున్న కేజీఎఫ్ నటి.. వీడియో వైరల్

Raveena Tandon: కేజీఎఫ్ 2’లో నటించిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెపై కొందరు దాడి చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఏమైంది. ఎవరు రవీనాపై దాడి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే విషయానికొస్తే..


ముంబైల్‌లోని బాంద్రాలో రవీనా టండన్ ప్రయాణిస్తున్న కారు ఓ మహిళను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడగా.. ఆ మహిళ కుటుంబ సభ్యులంతా కలిసి రవీనా డ్రైవర్‌పై గొడవకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో రవీనా టండన్ కారుదిగి గాయపడిన వారితో గొడవపడింది. అదే సమయంలో వారంతా ఒక్కసారిగా రవీనాపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఇంతలో ఆ కారు డ్రైవర్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. దాన్ని ఆపేందుకు రవీనా ప్రయత్నించింది. దాంతో అతడు అక్కడ నుంచి పారిపోయాడు.

తాజాగా ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రవీనా.. దయచేసి ఎవరినీ కొట్టవద్దు అంటూ వేడుకుంటుంది. అయినా సదరు వ్యక్తులు మాత్రం వినిపించుకోకుండా రవీనాతో వాగ్వాదం చేస్తున్నారు. గాయపడిన వ్యక్తికి బ్లడ్ వస్తుందని తనకు తెలుసు అని.. తన డ్రైవర్‌ను కొట్టవద్దని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. దయచేసి దాడి చేయకండి అంటూ రవీనా టండన్ వారిని వేడుకున్నట్లు వీడియోలో కనిపించింది. అదే సమయంలో సదరు వ్యక్తులు ‘మీ డ్రైవర్ నన్ను కొట్టాడు. నా ముక్కు నుంచి కూడా బ్లడ్ వస్తుంది. పారిపోయిన మీ డ్రైవర్‌ను ఇక్కడికి తీసుకురండి’ అంటూ ఆ గుంపులోంచి ఓ వ్యక్తి అరుస్తున్నాడు.


Also Read: పులిని వీడియో తీసి వివాదాల్లో ఇరుక్కున్న రవీనా టాండన్..

అయితే ఈ విషయం గురించి బాంద్రా నివాసి అయిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. నటి రవీనా టండన్‌తో పాటు ఆమె డ్రైవర్ కూడా తమపై దాడి చేశారని తెలిపాడు. అయితే ఇదే విషయమై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. పోలీసులు పట్టించుకోకుండా కంప్లైంట్ తీసుకోవడం లేదని పేర్కొన్నాడు. మద్యం మత్తులో రవీనా టండన్ తమ ఫ్యామీలీపై అసభ్యపదజాలంతో దూషించిందని అన్నారు.

అందువల్ల వెంటనే ఆమెతో పాటు ఆమె డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయమై పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడవన్నాయి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×