Jailer 2 Update :సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) 7పదుల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు రజినీకాంత్.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో రజినీకాంత్ పని అయిపోయిందని, ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చింది అని, ఆంటీ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేశారు. కానీ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar)దర్శకత్వంలో వచ్చిన జైలర్ (Jailer) సినిమాతో సూపర్ స్టార్.. తన అభిమానుల ఆకలి తీర్చడమే కాదు.. మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు.
త్వరలో సెట్ పైకి జైలర్ 2..
ఈ సినిమా ఇచ్చిన విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు రజినీకాంత్. ఇక ఈ ఏడాది ‘వేట్టయాన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున (Nagarjuna) కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమా చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ బర్తడే కి ఈ సినిమా ప్రకటించగా.. అభిమానులంతా కూడా ఈ సీక్వెల్ పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా జైలర్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ పర్ఫామెన్స్ అగరగొట్టబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నెల్సన్ కూడా సినిమాపై హైప్ పెంచేలా జైలర్ యాక్షన్ సన్నివేశాలకు మించి ఫైట్ సీన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పి హైప్ పెంచేశారు.
తమన్నాతో పాటు అందాలు ఆరబోయడానికి సిద్ధమైన శ్రీనిధి శెట్టి..
అటు యాక్షన్ పర్ఫామెన్స్ కి తగ్గట్టు గ్లామర్ డోస్ కూడా పెంచనున్నట్లు సమాచారం. అందుకే జైలర్ 2 లో కేజీఎఫ్ భామ అందాల తార శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)ని కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘కే.జీ.ఎఫ్’ 1, 2 సినిమాల తర్వాత హిట్ కొట్టాం కదా అని వచ్చిన ప్రతి సినిమా చేయాలని ఆమె అనుకోవడం లేదు. అందుకే ఆచి తూచి.. తన వద్దకు వచ్చే కథలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పటికే నాని(Nani)తో ‘హిట్ 3’, సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)తో ‘తెలుసు కదా’ అనే సినిమాలు చేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ తో ‘జైలర్ 2’ లో నటించడానికి సిద్ధం అయింది. ఇక ఈ సినిమాలో కూడా తమన్నా (Tamannaah) మళ్ళీ తన అందాలు ఒలకబోయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అసలే ఇద్దరు గ్లామర్ బ్యూటీస్.. ఒకేసారి ఒకే సినిమాలో గ్లామర్ డోస్ ఒలకబోస్తే ఆడియన్స్ తట్టుకుంటారా ? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా జైలర్ 2 యాక్షనే కాదు గ్లామర్ తో కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.