BigTV English

Casting Couch: నేను ఆ బాధితుడినే.. క్యాస్టింగ్ కౌచ్‌ పై బన్నీ షాకింగ్ కామెంట్స్..

Casting Couch: నేను ఆ బాధితుడినే.. క్యాస్టింగ్ కౌచ్‌ పై బన్నీ షాకింగ్ కామెంట్స్..

Casting Couch: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే తమ కోరికలు తీర్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని అందుకే చాలా మంది టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడుతున్నారని మొన్నామధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన ఆడవారే కాదు మగవారు కూడా భాదింపబడ్డారని వినిపిస్తుంది. తాజాగా మరో నటుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి బయట పెట్టాడు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ నటుడు మరెవ్వరో కాదు. అల్లు అర్జున్ విలన్ రవికిషన్.. ఈయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రముఖ నటుడు రవికిషన్ ఇటీవల రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో తన కేరీర్ మొదట్లో ఎలాంటి పరిస్థితులను ఎదురక్కొన్నాడు అనే విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా రంగంలో అడుగుపెట్టే ముందు తమ కుటుంబం పేదరికంలో ఉందని, వారి బతుకుబండిని నడిపేందుకు సినీ ఇండస్ట్రీలో ప్రవేశించాల్సి వచ్చిందని చెప్పారు. ముంబైకి వచ్చిన తరువాత ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. డబ్బు లేకపోతే చాలు, కొందరు మన పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఇబ్బంది పెట్టేందుకు రెడీగా ఉంటారు. ఇది కేవలం సినిమా ఫీల్డ్‌లోనే కాదు, ఏ రంగంలో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది.. నేను మొదట్లో దీని బాధితుడినే.. కానీ ఎప్పుడు, ఎక్కడా తల వంచలేదు.. అందుకే కొన్ని ఆఫర్స్ ఛేజారి పోయాయని ఆయన అన్నారు..

అలాగే చిన్నతనంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. జీవితంలో సక్సెస్ కోసం షార్ట్ కట్స్ ఎంచుకున్న వారిని నేను చూసాను. వారిలో కొందరు తీవ్రంగా బాధపడి, మరికొందరు చెడు అలవాట్లకు బానిసలయ్యారు. కొందరు ప్రాణాలకే తెగించారని ఆయన పేర్కొన్నారు. జీవితంలో సక్సెస్ ను సాధించాలంటే కష్ట పడటమే మార్గం.. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఎప్పుడు ఆ విషయాలను మర్చిపోవద్దని సలహా ఇచ్చారు. భోజ్ పురి, హిందీ సినిమాల్లో నటించి విపరీతమైన గుర్తింపు పొందిన రవికిషన్, తెలుగులో రేసుగుర్రం మూవీలో విలన్ పాత్రలో కనిపించి ఆయన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సరి కొత్త కథతో ఈ మూవీ రాబోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య అఖండ 2 మూవీ షూటింగ్ లో బిజీ కానున్నారని సమాచారం..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×