Perni Nani: వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మంత్రి తన కుటుంబంపై బాగా ఫోకస్ పెట్టాడని అన్నారు. తన భార్యను అరెస్ట్ చేయించాలని ఆ మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు, ఎమ్మెల్యేలే దానికి సాక్ష్యమని చెప్పారు. చంద్రబాబు దగ్గర కూడా ఈ విషయంపై చర్చించారని నాని మాట్లాడారు. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారని వివరించారు. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలకు అయితే పులిస్టాప్ పెట్టడం లేదని అన్నారు. ఇంట్లో మహిళల జోలికి వెళ్లడం సరికాదని ఫైరయ్యారు.
గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 10 నుంచి తన భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తన కుటుంబంపై అత్యుత్సాహంతో అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. తమ అత్తమామలు నిర్మించి చేసి గోడౌన్ తమకు ఇచ్చారని అని పేర్నినాని చెప్పారు.
తమకు అద్దెలు వస్తాయని నిర్మాణం చేశామని.. తాను, తన భార్య రోజు వెళ్లి చూసేదేమీ ఉండదన్నారు. తమ దగ్గర ఉన్న మేనేజర్ అక్కడ స్టాక్ లో తేడాలు ఉన్నాయని చెప్పారు. స్టాకులో లోపం ఉందని తెలిశాక గడిచిన నెలలో జాయింట్ కలెక్టర్‌కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామని అన్నారు. తమ వల్ల తప్పు లేకపోయినా స్టాక్ తగ్గిందనికి నైతిక బాధ్యత వహించి లేఖ ఇచ్చామని పేర్కొన్నారు. అధికారులు స్టాక్ వెరిఫై చేసి సివిల్ సప్లయిస్ ఎండీకి లెటర్ రాశారని అన్నారు. ఈనెల 10వ తేదీన వారు క్రింది స్థాయి అధికారులకు డబ్బులు కట్టించుకుని క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారన్నారు.
జనవరి 2వ తేదీన తమ గోదాం మేనేజర్ క్వాష్ పిటిషన్ విచారణ ఉంది. ఆలోగా నన్ను, నా కుమారుడిని పోలీసులు అరెస్టు చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తమ రాజకీయాలు, కక్ష సాధింపు కోసం ఇంట్లోని ఆడవాళ్ల జోలికి రావడం బాధాకరమని ఆయన అన్నారు. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఎవరైనా ఇలా చేస్తారా అని పేర్నినాని పేర్కొన్నారు.
Also Read: AP DGP Warning : పవన్ కళ్యాణ్ పట్టుబడితే విడువరు.. పీడీఎస్ అక్రమ రవాణా కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
తాను తప్పుడు పనులు చేసే వ్యక్తినా.. రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తిని ఉద్దేశ్య పూర్వకంగా పని చేస్తానా..? అని ప్రశ్నించారు. తానెప్పుడూ ఎలాంటి తప్పుడు పనులు చేయించలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని.. తన భార్యను అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.