Srinidhi Shetty: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్స్ కు ఎప్పుడు హిట్ వస్తుందో.. ఎప్పుడు స్టార్ డమ్ వస్తుందో చెప్పడం కష్టం. కొంతమందికి మొదటి సినిమాతోనేవస్తుంది. ఇంకొంతమందికి కొన్ని సినిమాలు చేశాక వస్తుంది. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్నవారు.. మరో సినిమాతో అంతే విజయాన్ని అందుకోలేకపోతున్నారు. అలా ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన హీరోయిన్స్ లిస్ట్ లో శ్రీనిధి శెట్టి ఒకరు.
కెజిఎఫ్ సినిమాతో ఈ కన్నడ బ్యూటీ.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత అంతటి విజయం.. కాదు కాదు.. కనీసం ఒక మోస్తరు విజయాన్ని అయినా అందుకుంటుందేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, శ్రీనిధి మాత్రం ఇంకా కెజిఎఫ్ హిట్ ఖాతా తరువాత ఇంకొక హిట్ ను యాడ్ చేయలేకపోతోంది. పోనీ.. సినిమాలు రావడం లేదా అంటే.. అది లేదు. స్టార్ హీరోల సరసన జతకడుతుంది.
ఇక శ్రీనిధి శెట్టి.. తెలుగు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని సరసన నటించడానికి రెడీ అయ్యింది. సరిపోదా శనివారం హిట్ తో మరింత జోష్ పెంచిన నాని.. వెంటనే గ్యాప్ కూడా ఇవ్వకుండా హిట్ 3 షూటింగ్ కు రెడీ అయిన సంగతి తెల్సిందే. శైలేష్ కొలను ప్రాంఛైజ్ గా హిట్ సిరీస్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. హిట్ లో విశ్వక్ సేన్ నటించగా.. హిట్ 2 లో అడివి శేష్ నటించాడు. ఇప్పుడు హిట్ 3.. నాని వద్దకు చేరింది.
ఇక ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంపిక అయ్యినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. తాజాగా ఆమె షూటింగ్ లో కూడా పాల్గొందని చెప్పుకొస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. నాని, శ్రీనిధి శెట్టికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఇక శ్రీనిధి శెట్టి పోస్టర్ ను నాని షేర్ చేస్తూ.. “మ్యాడ్ నెస్ కు మరో వైపు” అని క్యాప్షన్ ఇస్తూ.. హిట్ 3 లోకి శ్రీనిధిని ఆహ్వానించాడు. చీరకట్టు లో కెజిఎఫ్ బ్యూటీ ఎంతో అందంగా కనిపించింది. మొదటి నుంచి కొత్త హీరోయిన్స్ కు హిట్లు ఇచ్చింది నానినే. ఇక ఇప్పుడు ఈ కెజిఎఫ్ బ్యూటీకి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాని తీసుకున్నట్లే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతోనైనా శ్రీనిధి హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.
Other side of the madness 🙂
Welcome on board @SrinidhiShetty7 🤗#Hit3 pic.twitter.com/oUR0R0FT9E
— Nani (@NameisNani) October 2, 2024