Khushbu Sundar: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎక్కువగా ఆరోగ్యం పైన, ఫిట్నెస్ పైన ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో కొంతమంది చిన్న వయసులోనే విపరీతమైన బరువు పెరిగిపోతే.. మరికొంతమంది 50 ఏళ్లు వచ్చినా అంతే సన్నగా కరెంటు తీగలా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. మరికొంతమంది మొదట బరువు పెరిగినా.. ఆ తర్వాత కష్టపడి బరువును తగ్గించుకుంటూ గుర్తు పట్టలేనంతగా మారిపోతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) కూడా ఒకరు.
గుర్తుపట్టాలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్..
మొన్నటి వరకు చాలా బొద్దుగా కనిపించిన ఈమె.. ఇప్పుడు సడన్గా సన్నబడిపోయి, ఆ ఫోటోలను తన అధికారిక ఎక్స్ ద్వారా షేర్ చేయడంతో ఆమె అభిమానులు కూడా గుర్తుపట్టలేకపోయారు. తాజాగా స్లీవ్ లెస్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి, జుట్టు విరబోసుకొని సెల్ఫీ ఫోటోలను షేర్ చేసింది ఖుష్బూ. అయితే ఆ ఫోటోలలో ఆమెను ఫ్యాన్స్ గుర్తుపట్టలేనట్టుగానే అనిపిస్తోంది. దీంతో పలువురు నెటిజన్స్ ఎప్పటిలాగే పలు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది ఖుష్బూ సుందర్ సన్నబడిన తర్వాత చాలా బాగుంది అని కామెంట్ చేయగా.. మరికొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొక నెటిజన్ కాస్త హద్దులు మీరుతూ “మౌంజారో ఇంజక్షన్ మ్యాజిక్ ఇది.. అయితే మీరు సన్నబడిన తర్వాత ఈ విషయం మీ ఫాలోవర్లకి కూడా తెలిసి, వాళ్లు కూడా ఈ ఇంజక్షన్ తీసుకోవాలనే కదా మీ ఉద్దేశం..” అంటూ కామెంట్ చేశారు. దీంతో ఖుష్బూ రియాక్ట్ అవుతూ ఆ నెటిజన్ పై గట్టిగానే కౌంటర్ ఇచ్చింది..
నెటిజన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ..
ఖుష్బూ రియాక్ట్ అవుతూ..” అసలు మీరు ఎలాంటి వ్యక్తులు..? మీరు ఎప్పుడూ మీ ముఖాలు చూపించరు.. ఎందుకంటే మీ లోపల అంతా మురికే ఉంది. మీ తల్లిదండ్రులను చూస్తే జాలేస్తోంది “అంటూ రీకౌంటర్ ఇచ్చింది ఖుష్బూ. ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన పోస్ట్ , ఫోటోలు అలాగే కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఖుష్బూ సినిమాలు..
ఇక ఖుష్బూ విషయానికి వస్తే.. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవికి అక్కగా.. పవన్ కళ్యాణ్ కు సవతి తల్లిగా నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె వెంకటేష్ లాంటి హీరోల సరసన జోడిగా చేసి అలరించింది. ఎక్కువగా కోలీవుడ్లో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా విజయ్ చివరి సినిమా అయినా ‘జననాయగన్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా ఎన్నికైన విషయం తెలిసిందే. సరదాగా సెట్లో వీరు ముగ్గురు కలిసి దిగిన సెల్ఫీలను కూడా తమ ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు.అయితే అప్పుడు కాస్త లావుగా కనిపించిన ఖుష్బూ ఇంతలోనే ఇంత బక్క చిక్కిపోయి కనిపించడంతో నెటిజన్స్ పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కుష్బూ 54 సంవత్సరాల వయసులో కూడా ఇలా సన్నగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పవచ్చు.
Back to the future! 💚#greenwithenvy #trendy#transformation #goodhealth #lovingit#Green#GlamourSlam pic.twitter.com/EypIRH9Ovu
— KhushbuSundar (@khushsundar) April 15, 2025