Hyderabad Crime News: ఒకప్పుడు చదువుకుంటే బెటరని చెప్పేవారు. వారి అంతా తెలుస్తుందని అనేవారు. ఇప్పుడు చదువు లేనివారు బెటర్. ఎందుకంటే ఈ టెక్ యుగంలో జాగ్రత్తగా ఉండేదివారే. అందుకు మాజీ మహిళా ప్రొఫెసర్ ఒక ఉదాహరణ. డిజిటల్ అరెస్ట్ పేరుతో నెలరోజులుగా ఆమె నుంచి కోటిన్నరకు పైగా కొట్టేశారు మహా కేటుగాళ్లు. అదెలా సాధ్యం.
డిజిటల్ అరెస్ట్ అంటూ మహా మాయగాళ్లు ఫోన్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వారి ఉచ్చులో పడగొద్దని పోలీసులు పదే పదే చెబుతున్నారు. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. తమ ఫోన్లకు సమాచారం ఇస్తున్నారు. అయినా జరగాల్సిన నష్టం సామాన్యుడికి జరిగిపోతూనే ఉంది.
డిజిటల్ అరెస్టు పేరిట రిటైర్ మహిళా ప్రొఫెసర్ నుంచి రూ. 1.60 కోట్ల కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. వారి బెదిరింపులకు బంధువుల వద్ద అప్పు చేసి మరీ వారికి ఇచ్చారామె. చివరకు తాను మోసపోయానని గమనించి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగింది?
మేడ్చల్‌కు చెందిన రిటైర్ మహిళా ప్రొఫెసర్‌కు కొద్దిరోజుల కిందట వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. తాము ఢిల్లీ సైబర్‌క్రైమ్ నుంచి మాట్లాడుతున్నామని మోసగాళ్లు ఆమెని నమ్మించారు. మీపై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. తాను ఏమీ చేయలేదని ఆమె చెప్పినా ఏ మాత్రం సైబర్ క్రిమినల్స్ పట్టించుకోలేదు. అనుమానితుల జాబితాలో ఉన్నారని, దీనిపై సీబీఐ అధికారులతో మాట్లాడాలన్నారు.
ALSO READ: కూతుర్ని రే*ప్ చేసిన తండ్రి, విశాఖలో దారుణం
కాసేపటికి సీబీఐ అధికారినంటూ ప్రొఫెసర్‌కు మరో వ్యక్తి కాల్ చేశాడు. మనీ లాండరింగ్ వ్యవహారంలో మీ ప్రమేయముందని చెప్పాడు. రేపో మాపో పాస్‌పోర్టు రద్దవుతుందని, ఇకపై విదేశాలకు వెళ్లలేరని భయపెట్టాడు. మీకు ఎక్కడ బ్యాంకు ఖాతాలున్నాయో వివరాలు ఇవ్వాలని కోరారు. వెంటనే తన అకౌంట్ల వివరాలను వారికి ఇచ్చేశారు మాజీ ప్రొఫెసర్.
డిజిటల్ అరెస్ట్ అంటూ మోసం
బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేసి మనీ లాండరింగ్ ఉన్నట్లు గుర్తిస్తే అరెస్టు చేస్తామని మళ్లీ బెదిరించారు. ఆర్బీఐ తనిఖీ పూర్తి అయ్యేవరకు ఖాతాల్లో డబ్బు తమకు బదిలీ చేయాలన్నారు. అందుకు ట్రాయ్, సీబీఐ, ఆర్థికశాఖతో ఒప్పందం చేసుకున్నట్లు ఒక పేపర్‌ని ఆ మహిళకు పంపారు. ప్రస్తుతం దర్యాప్తు అవుతుందని, పూర్తి అయ్యేవరకు దేశం విడిచి వెళ్లొద్దని తెలిపారు.
సీబీఐతో ఒప్పందం విషయాన్ని ఇతరులకు చెప్పడం నేరమని, వాటిని ఉల్లంఘిస్తే జైలు శిక్షతోపాటు 5 లక్షల జరిమానా ఉంటాయని అందులో ప్రస్తావించారు. వారు అంత కరెక్టుగా చెబుతున్నారంటే నిజమేనని నమ్మేసింది బాధితురాలు. మోసగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ. కోటి బదిలీ చేశారు. ఇక్కడితో తనకు గండం గడిచిందని అనుకున్నారు ఆమె.
కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి డబ్బు పంపాలని బెదిరించారు. చివరకు బంధువు దగ్గర అప్పు తీసుకొని కేవలం నెల రోజుల వ్యవధిలో ఏడుసార్లు రూ.60 లక్షలు బదిలీ చేశారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.