Khushi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవిని మర్చిపోవడం ఏ అభిమాని వలన కానీ పని. భౌతికంగా ఆమె ఈ లోకంలో లేకపోయినా.. ఆమె సినిమాల ద్వారా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో జీవిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరు అందాల ముద్దగుమ్మలను ఇండస్ట్రీకి ఇచ్చి వెళ్ళింది. వారే ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. జాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ శ్రీదేవి పోలికలను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఒక్కోసారి కొన్ని యాంగిల్స్ లో శ్రీదేవినా.. ? అన్నట్లు కనిపిస్తుంది.
ఇక శ్రీదేవి బతికి ఉన్నంత కాలం జాన్వీ ఎంట్రీ చూడాలని ఎంతగానో ఆశపడింది. దానికోసమే కష్టపడింది కూడా. కానీ, జాన్వీ ఎంట్రీ చూడకుండానే ఆమె కన్నుమూసింది. ఇక తల్లి లేని లోటును తెలియకుండా ఇద్దరు కూతుళ్లను కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు బోనీకపూర్. ఇప్పటికే జాన్వీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నదానికి అంతగా హిట్ దక్కలేదు.
దేవర తరువాత ఆమె RC16 లో చరణ్ సరసన నటిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. జాన్వీకి దైవ భక్తి ఎక్కువ.. నెల మొత్తం ఎలాగైనా ఉండనీ.. కానీ, రెండు మూడుసార్లు మొత్తం తిరుపతి స్వామివారి దర్శనం చేసుకోపోతే ఈ చిన్నదానికి అస్సలు గడవదు. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అందాలను ఆరబోసే జాన్వీ .. స్వామివారి దర్శనానికి వస్తె మాత్రం అచ్చ తెలుగు ఆడపిల్లలా మారిపోతుంది. ఇక మొన్నటికి మొన్న జాన్వీ తన పెళ్లి గురించి చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.
Poonam Kaur: త్రివిక్రమ్ టార్చర్.. అన్ని కోల్పోయాను.. మరోసారి బాంబ్ పేల్చిన పూనమ్
” నేను తిరుపతిలోనే పెళ్లి చేసుకొని.. అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. నేను, నా భర్త, ముగ్గురు పిల్లలు.. రోజు గోవిందా నామాలు వింటూ.. అరిటాకులో భోజనం చేస్తూ గడపాలి. మా ఆయన తలకు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో జాన్వీ పెళ్లి ప్లానింగ్ మస్త్ ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక అక్కే ఆ రేంజ్ లో చెప్తే నేను ఇంకే రేంజ్ లో చెప్పాలి అనుకున్నదో ఏమో చెల్లి ఖుషీ కపూర్ సైతం తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.
ది ఆర్చీస్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఖుషీ.. ప్రస్తుతం లవ్ యాపా సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో హిట్ అందుకున్న లవ్ టుడే సినిమాకు రీమేక్ గా లవ్ యాపా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్లమీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుషీ తన పెళ్లి ముచ్చట్ల గురించి చెప్పుకొచ్చింది.
” నాకు చిన్నప్పటి నుంచి నా పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని కలలు కనేదాన్ని. అక్క చెప్పినట్లుగానే నేను కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది. భర్త, ఇద్దరు పిల్లలు, తండ్రి బోనీ కపూర్.. చాలా పెంపుడు కుక్కలు ఇలా నా లైఫ్ ను నేనెప్పుడూ ఉహించుకుంటాను. మా నాన్న నాతోపాటే ఒకే అపార్ట్మెంట్ లో ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. మరి అక్కలా.. భర్తకు హెడ్ మసాజ్ చేస్తారా.. ? అంటే అందుకు మాత్రం నో అని సమాధానమిచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్స్.. శ్రీదేవి కూతుళ్లా.. మజాకానా.. పెళ్లి తరువాత మంచి ప్లానింగ్ చేసుకున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు.