Anirudh Ravichandran:ఒక సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్షన్ తో పాటు హీరో, హీరోయిన్ల యాక్టింగ్,కథ ఇలా అన్నీ బాగుండాలి. ఇక వీటన్నింటికి తోడు మ్యూజిక్ కూడా ఉంటేనే ఆ సినిమా పరిపూర్ణంగా హిట్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఇండస్ట్రీలో కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు తెరమీదకి వస్తున్నారు. అలా చిన్న చిన్న సినిమాల ద్వారా ఎంట్రీ ఇస్తూ పెద్దపెద్ద హీరోలకు సైతం మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ల హవా నడుస్తోంది. అలా భీమ్స్ సిసిరోలియో, అనిరుధ్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంటున్నారు. ఇక వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనిరుధ్ (Anirudh).. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రస్తుతం రెమ్యూనరేషన్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అనిరుధ్ తన నెక్స్ట్ మూవీకి ఏకంగా హీరోలను బీట్ చేసేలా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. మరి ఇంతకీ అనిరుధ్ తీసుకుబోతున్న రెమ్యూనరేషన్ ఎంతో ఇపుడు చూద్దాం.
ఆశ్చర్యపరుస్తున్న జైలర్ 2 అనిరుధ్ రెమ్యునరేషన్..
తన మాస్ బీట్స్ తో ఎంతోమంది కుర్రకారుని ఉర్రూతలూగించిన అనిరుధ్ మొదటి మూవీతోనే హిట్ కొట్టాడు. ధనుష్(Dhanush) హీరోగా చేసిన ‘3’మూవీలో ‘వై దిస్ కొలవెరి’ అనే పాటకు మ్యూజిక్ అందించి, సరికొత్త సెన్సేషన్ సృష్టించారు అనిరుధ్. ఆ తర్వాత ఈయన చేసిన వరుస సినిమాలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా అనిరుధ్ మాస్ సినిమాలకు తనదైన స్టైల్ లో మ్యూజిక్ అందిస్తారు. అలా అనిరుధ్ మ్యూజిక్ అందించిన మాస్టర్, జెర్సీ, బీస్ట్,జైలర్, దేవర, జవాన్ వంటి ఎన్నో సినిమాలు మ్యూజికల్ గా పెద్ద హిట్ కొట్టాయి. ఇక ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ కి ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు అనిరుధ్ రవిచంద్రన్ కూడా అంతే ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన జైలర్-2 కి తీసుకోబోయే రెమ్యూనరేషన్ తో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. అయితే కోలివుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జైలర్ -2 కి అనిరుధ్ రవిచంద్రన్ ఏకంగా రూ .18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే రజినీకాంత్ హీరోగా చేసిన జైలర్ మూవీకి రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఈయన బాలీవుడ్ నటుడు అయినటువంటి షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీకి రూ.10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
అదే నిజమైతే ఆ రికార్డు ఈయనదే..
ఇదిలా ఉండగా.. జైలర్ -2 కి అనిరుధ్ రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ నిజమే అయితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ (AR Rahman) ని కూడా పారితోషికంలో అనిరుధ్ బీట్ చేసినట్టే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరి చూడాలి అనిరుధ్ రెమ్యూనరేషన్ విషయంలో ఇంకా ఎన్ని వార్తలు వినాల్సి వస్తుందో.. ఈ విషయం పక్కన పెడితే..అనిరుధ్ రవిచంద్రన్ సినిమాల కంటే ఎక్కువగా కోలీవుడ్ లో ఎఫైర్స్ ద్వారానే హాట్ టాపిక్ అయ్యారు. ఆయన తనకంటే వయసులో పెద్దదైన నటి ఆండ్రియాతో అలాగే త్రిష,కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు వారితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆండ్రియా తో అనిరుధ్ ప్రైవేట్ ఫోటోలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టడంతో అప్పట్లో వీరి గురించి కోలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.