BigTV English

Poonam Kaur: త్రివిక్రమ్ టార్చర్.. అన్ని కోల్పోయాను.. మరోసారి బాంబ్ పేల్చిన పూనమ్

Poonam Kaur: త్రివిక్రమ్ టార్చర్.. అన్ని కోల్పోయాను.. మరోసారి బాంబ్ పేల్చిన పూనమ్

Poonam Kaur:  నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ముఖ్యంగా అమ్మాయిల వేధింపుల గురించి న్యూస్ వచ్చింది అంటే.. ఎక్కడ ఉన్నా కూడా నేనున్నా అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక చాలాకాలంగా పూనమ్.. త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొస్తూనే ఉంది. గతంలో ఆమె త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని తెలుపుతూ ట్వీట్ కూడా చేసింది.


త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మా అసోసియేషన్ లో  ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ, నాలా చాలామందికి రాజకీయ  బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో నా ఫిర్యాదును వారు తిరస్కరించారు.  ఆ తరువాత కూడా నేను పెద్దలకు ఫిర్యాదు చేశాను. వాళ్లు కూడా నన్ను సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. ఇప్పుడైనా దర్శకుడు త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను  కోరుకుంటున్నాను” అని ఆమె సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. 

ఇక ఈ ఫిర్యాదుపై మా అసోసియేషన్.. ఇలా ట్వీట్స్ పెడితే కుదరదని, రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని.. ఇప్పటివరకు పూనమ్ అలా చేయలేదని.. ఒకవేళ మా ఆఫీస్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇలానే పూనమ్- మా అసోసియేషన్ మధ్య  మాటల యుద్ధం జరుగుతూనే వస్తుంది. సందు దొరికినప్పుడల్లా.. పూనమ్ .. త్రివిక్రమ్ గురించి ట్వీట్స్ వేస్తూనే  వస్తుంది. కొంతమంది ఆమె ఫేమస్ అవ్వడానికి  చేస్తున్నారని అంటుండగా.. ఇంకొందరుదీనివెనుక  పవన్ ఉన్నాడని చెప్పుకొస్తున్నారు.


Nidurinchu Jahapana Teaser: వెంకటేష్ రీల్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరిపోయిందంతే

ఇక ఈ విషయమై ఇప్పటివరకు త్రివిక్రమ్ నోరు విప్పింది లేదు. తాజాగా పూనమ్ మరోసారి బాంబ్ పేల్చింది. త్రివిక్రమ్ చేస్తున్న రాజకీయం వలన తాను అన్ని కోల్పోయాను అని చెప్పుకొచ్చింది. శనివారం.. కేంద్ర ప్రభుత్వం నందమూరి  బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక బాలయ్యకు అవార్డు రావడంపై టాలీవుడ్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తూ  పోస్టులు పెడుతున్నారు.   

ఇక పూనమ్ సైతం జై బాలయ్య అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కింద ఒక నెటిజన్.. ” మీరు బ్రతకడానికి ఏం చేస్తున్నారు” అని ప్రశ్నించాడు. దానికి పూనమ్.. ” త్రివిక్రమ్, అతని గ్రూప్ టార్చర్ పెట్టడం వలన నేను పనిచేయడం కూడా ఆపేశాను.. అన్ని కోల్పోయాను” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్స్ చాలావరకు పూనమ్ కు హెల్ప్ చేయాలనీ  కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ఆవేదనను అర్ధం చేసుకోండి అని, ఆమెకు హెల్ప్ చేయండి అని  రాసుకొస్తున్నారు. 

మాయాజాలం అనే సినిమా ద్వారా పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన పూనమ్.. స్టార్ హీరోయిన్  గా మారుతుందని అనుకున్నారు. కానీ, ఆమె కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమయ్యింది. జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్ర కోసం మొదట పూనమ్ నే అనుకున్నారు. ఆ సినిమా సమయంలోనే పూనమ్ కు, త్రివిక్రమ్ పరిచయమయ్యాడు. ఇక  పవన్ – పూనమ్ మధ్యలో త్రివిక్రమ్ వచ్చినట్లు సమాచారం. పవన్ వద్దకు పూనమ్ వెళ్లకుండా గురూజీ అడ్డుపడుతున్నట్లు టాలీవుడ్ లో టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది అనేది తెలియాల్సి ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×