Kiara Advani : ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో పేరు దక్కించుకున్న ఈమె, వరుస సినిమాలలో నటిస్తోంది. కానీ ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా మారడంతో లేటెస్ట్ వెర్షన్ ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయినా సరే అవకాశాలు మాత్రం తలుపు తడుతున్నాయి అనడంలో సందేహం లేదు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్లో లక్కీ లేడీగా గుర్తింపు..
ప్రముఖ గ్లామర్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఛార్మింగ్ గర్ల్ గా పేరు సొంతం చేసుకుంది. అక్కడ అనతి కాలంలోనే తిరుగులేని హీరోయిన్‌గా పాపులారిటీ అందుకుంది. ‘ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ’ తో ఓవర్ నైట్ లోనే అభిమానుల క్రష్ గా మారిపోయిన ఈమె, ఆ తర్వాత ‘కబీర్ సింగ్’, ‘లస్ట్ స్టోరీస్’, ‘గుడ్ న్యూస్’ వంటి చిత్రాలతో లక్కీ లేడీగా మారింది. వీటితోపాటు ‘షేర్సా’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి చిత్రాలు ఈమెకు మంచి స్టార్డంను తెచ్చిపెట్టాయి. అలా బాలీవుడ్ లో ఈమె చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో సౌత్ హీరోలు , దర్శకుల దృష్టి ఈమెపై పడింది. అందులో భాగంగానే సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.
ఐరన్ లెగ్ గా మారిన కియారా అద్వానీ..
అందులో భాగంగానే ఈ సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్(Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. గతంలో రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేసినా ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. దీంతో అభిమానులలో కొత్త భయం పుట్టుకొస్తోందని చెప్పవచ్చు. నార్త్ లో ఈమెకు కలిసొచ్చింది కానీ సౌత్ లో మాత్రం ఐరన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలాంటి సమయంలో కూడా ఈమెకు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులలో అవకాశం లభించడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి .
వరస పాన్ ఇండియా చిత్రాలలో అవకాశం..
అందులో భాగంగానే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR ) కలసి నటిస్తున్న ‘వార్ 2’ లో హృతిక్ రోషన్ కి జోడిగా నటించబోతుందని సమాచారం. అలాగే కన్నడ హీరో యష్ (Yash ) నుండి వస్తున్న మోస్ట్ హై బడ్జెట్ మూవీ టాక్సిక్ (Toxic) లో కూడా హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఇందులో నయనతార (Nayanthara) యష్ సోదరిగా నటిస్తూ ఉండగా.. యష్ సరసన కియారా నటిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు వీరిద్దరూ సెట్ లో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా సౌత్ లో ఈమె నటిస్తున్న సినిమాలు సక్సెస్ కాకపోయినా వరుస పాన్ ఇండియా చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.