BigTV English

fauji Movie : డార్లింగ్‌కు జోడీగా సాయి పల్లవి..? అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బాగుందో!

fauji Movie : డార్లింగ్‌కు జోడీగా సాయి పల్లవి..? అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బాగుందో!

fauji Movie : టాలీవుడ్ స్టార్ హీర్ ప్ర‌భాస్, హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ నటిస్తోంది. ఇక ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మరో కథానాయిక కోసం చిత్ర బృందం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సాయి పల్లవి సంప్రదించనున్నారనే టాక్ వినిపిస్తోంది.


డార్లింగ్ ప్రభాస్ హీరోగా త్వరలోనే ఫౌజీ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో లీక్స్ హల్చల్ చేస్తున్నాాయి. ఇందులో ప్ర‌భాస్ బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడని… నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ కన్ఫామ్ కాగా.. ఫ్లాష్ బ్యాక్ లో కథను మలుపుతిప్పే ఓ అరగంట పాత్రలో కనిపించేందుకు మరో హీరోయిన్ కోసం చిత్రబృందం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

‘ఫౌజీ’లో ఫ్లాష్ బ్యాక్ సినిమాలో చాలా కీల‌క‌ంగా మారనున్నట్లు స‌మాచారం. క‌థ‌కు సంబంధించిన ఆయువు ప‌ట్టు అక్క‌డే ఉంద‌ని.. అందుకే ఇందులో కనిపించే ప్రతీ పాత్రను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో క‌నిపించే హీరోయిన్‌ పాత్రలో ఓ స్టార్ నటి కనిపిస్తే సినిమా మరింత అద్భతంగా వస్తుందని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం.


ALSO READ : ఆ హీరోకు కూతురిగా, లవర్ గా నటించాను.. అంకుల్ అంటే వద్దు అలా పిలవకని..

ఇందులో భాగంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులో సాయి పల్లవి పేరు కూడా ఉందని.. త్వరలోనే దర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడి సాయి పల్లవితో భేటీ కానున్నారని సమాచారం. ఒకవేళ సినిమా కథ, అందులోని పాత్ర సాయి పల్లవికి నచ్చితే ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని సినీ బృందం నిర్ణయించుకుందని సినీ వర్గాల టాక్. ఇక ఇప్పటివరకూ ఈ విషయంపై చిత్ర బంధం ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.

ఇక ఇప్పటికే సాయి పల్లవి ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ ఉండే సినిమాల్లో నటించింది. 2021లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రోజీ పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె కనిపించిన 40 నిమిషాలు ఎంతో ప్రత్యేకంగా మారాయి. ముఖ్యంగా సినిమా విజయంలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సాయి పల్లవిని మరొకసారి ఫౌజీ బ్యాగ్రౌండ్ లో చూపించనున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం సాయి పల్లవి థండెల్ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతుంది. ప్రేమమ్, సవ్యసాచి సినిమాలను నాగచైతన్యతో తెరకెక్కించిన చందు మెుండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా డి.మత్సలేశం గ్రామానికి చెందిన మత్సకారుల జీవిత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈ సినిమా లాంఛ్ అయ్యాక ఫౌజీ మూవీపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×