Nadaaniyan OTT Release:ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే సినీ సెలబ్రిటీల వారసుల సినిమాల కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటుల వారసుడు లేదా వారసురాలు ఎలా నటిస్తారు? తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారా? మొదటి సినిమాతో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయనున్నారు? ఇలా పలు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) చిన్న కూతురు ఖుషీ కపూర్(Khushi Kapoor), ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif AliKhan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan)కలిసి జంటగా ఇండస్ట్రీకి తొలిసారి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ దర్శక నిర్మాత, హోస్ట్ కరణ్ జోహార్(Karan Johar) బ్యానర్లో వీరిద్దరూ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అనే టైటిల్ కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక ఇందులో దియా మీర్జా, దుగల్ హన్సరాజ్, సునీల్ శెట్టి, మహిమా చౌదరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
నేరుగా ఓటీటీలోకి రానున్న నడానియన్..
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటీనటుల వారసుల మొదటి సినిమాను థియేటర్లలో చూడాలనుకుంటే.. సడన్గా ఇలా ట్విస్ట్ ఇచ్చారు ఏంటి? అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ విషయాన్ని ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix);అధికారికంగా ప్రకటించింది. అయితే ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే విషయాన్ని ప్రకటించలేదు. కానీ త్వరలో అంటూ సస్పెన్స్ లో పెట్టేసింది. ఏది ఏమైనా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లోకి రాబోతుండడంతో అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో.. ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ‘ సినిమాకు గానూ కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన షావునా గౌతమ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.
ఇబ్రహీం అలీ ఖాన్ కెరియర్..
సైఫ్ అలీ ఖాన్ (Saif AliKhan), ఆయన మాజీ భార్య అమృతా సింగ్ (Amritha Singh) తనయుడే ఈ ఇబ్రహీం అలీ ఖాన్. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ హీరోయిన్ కరీనాకపూర్ (Kareena Kapoor) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక మరోపక్క సైఫ్ అలీ ఖాన్ ఇటీవల కత్తి దాడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం తెలిసిందే.ఇక కొడుకును సక్సెస్ దిశగా అడుగులు వేయించడానికి భారీగా కష్టపడుతున్నారు.
ఖుషీ కపూర్..
దివంగత నటీమణి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్(Boney Kapoor) చిన్న కూతురు ఈమె. ఇండస్ట్రీలోకి రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అక్క జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తో పోటీ పడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు తొలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. మరి వీరిద్దరి తొలి చిత్రం వీరి సినిమా కెరియర్ కు ఎలాంటి పునాదులు వేస్తుందో చూడాలి.