Kiara Advani : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న ఇంస్టాగ్రామ్ వేదికగా కియారా తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)తో కలిసి త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం అన్న విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఇద్దరూ చేతిలో చిట్టి పొట్టి సాక్స్ పట్టుకున్న పిక్ ను చేయగా, అది క్షణంలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కియారా అద్వానీ కవల పిల్లల గురించి మాట్లాడిన ఓ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె తన పిల్లలకు అచ్చం ఓ స్టార్ హీరోయిన్ లక్షణాలే ఉండాలని చెప్పడం విశేషం.
కియారాకు కవల పిల్లలు, హీరోయిన్ లక్షణాలు
శుక్రవారం కియారా, సిద్ధార్థ్ జంట తల్లిదండ్రులను కాబోతున్నామనే విషయాన్ని ప్రకటించగానే అలియా భట్, శిల్పా శెట్టి, కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor), కరణ్ జోహార్ వంటి స్టార్స్ ఈ జంటను అభినందించారు. అయితే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కియారా తనకు ఆరోగ్యకరమైన పిల్లలు కావాలని కామెంట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి కవల పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నారు ? అనే ప్రశ్న అడుగుతూ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు, ఇలా కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి… ఈ ఆప్షన్స్ లోకి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే కియారా మాత్రం “దేవుడు నాకు బహుమతిగా ఇద్దరు ఆరోగ్యకరమైన పిల్లలను ఇస్తే చాలు” అని సమాధానం చెప్పింది.
వెంటనే కరీనా కపూర్ ఆమెని సరదాగా ఆటపటిస్తూ “అది మిస్ యూనివర్స్ సమాధానంలా ఉంది” అని చమత్కరించింది. దీంతో కియారా “ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పింది. అయితే మీ కూతురుకు కరీనాలో ఉన్న ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారని అడిగారు. ఆ ప్రశ్నకు కియారా స్పందిస్తూ “కరీనా ఆత్మ విశ్వాసం, ఆమె ఎమోషన్స్, ఆమె ఆరా, ఆమెలో ఉన్న లక్షణాలన్నీ… పదికి పది ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో కియారాతో పాటు కరీనా, అక్షయ్ కుమార్, దిల్జిత్ దోసాంజ్ కూడా పాల్గొన్నారు. ‘గుడ్ న్యూస్’ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈ ఇంటర్వ్యూ జరగ్గా, ఆ కామెంట్శ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా తను గర్భవతి అని ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైమ్ కియారా అద్వానీ ముంబైలోని ఓ స్టూడియోలో కనిపించింది. తన వ్యానిటీలోకి కాలు పెట్టే ముందు, ఆమె సంతోషంగా ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చింది.
కియారా, సిద్ధార్థ్ లవ్ స్టోరీ
కియారా అద్వానీ, సిద్ధార్థ్ లవ్ స్టోరీ 4 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 2021లో ఈ జంట ‘షేర్షా’ అనే మూవీలో కలిసి నటించారు. ఈ వార్ డ్రామా తర్వాత ఈ జంట మధ్య ప్రేమ మొదలైంది. 2022లోనే డైరెక్టర్ కరణ్ జోహార్ వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న విషయాన్ని బయట పెట్టారు. 2023 ఫిబ్రవరి 7న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు త్వరలోనే కియారా – సిద్ధార్థ జంట పేరెంట్స్ కాబోతున్నారు.