PM Modi in Gir safari: మూడు రోజుల టూర్‌లో భాగంగా గుజరాత్ వెళ్లారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం జునాగఢ్ జిల్లాలో గిర్ సఫారీకి వెళ్లారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ లయన్ సఫారీ చేశారు. ఓపెన్ టాప్ జీప్‌లో తిరిగారు. సింహాలు, పులులను దగ్గరుండి తిలకించారు.
భూమిపై ఉన్న అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రజలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఒక్కానించారు. వన్యప్రాణులను సంరక్షించడానికి దేశం చేస్తున్న కృషిని మరువలేమన్నారు.
సోమవారం మధ్యాహ్నం గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన ఆఫీసులో నిర్వహిం చిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఆర్మీ స్టాఫ్, వివిధ రాష్ట్రాల సభ్యులు, పలు ఎన్‌జీవోల ప్రతినిధులు పాల్గొనున్నారు. ఆసియాటిక్ సింహాలను సంరక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ‘ప్రాజెక్ట్ లయన్’ కోసం రూ. 2,900 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆయా సింహాలు గుజరాత్‌లోని గిర్ అడవుల్లో దాదాపు 30,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నట్లు అధికారుల మాట. గుజరాత్‌లోని జునాగఢ్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది గిర్ నేషనల్ పార్క్. దేశంలో ప్రధాన జాతీయ ఉద్యానవనాలలో ఇది కూడా ఒకటి. అభయారణ్యం దాదాపు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
ALSO READ: పాస్ట్ పోర్టు నిబంధనల్లో మార్పులు
రెండు శతాబ్దాల పాటు అరణ్యాలలో తిరిగిన ఆసియా సింహాల పరిరక్షణకు గిర్ ప్రసిద్ధి చెందింది. 1884 నుంచి గిర్ నేషనల్ పార్క్ అంతరించి పోతున్న సమయంలో ఆసియా సింహాలకు ఏకైక సహజ నివాసంగా ఉంది. సింహాలతోపాటు దాదాపు 2,375 విభిన్న వన్యప్రాణుల జాతులకు గిర్ అభయారణ్యం కేరాఫ్ గా మారింది. అక్కడ నల్సరోవర్ సరస్సు సమీపంలో ఉంది.
ఆసియా సింహాలు.. ఆఫ్రికన్ సింహాల నుండి లక్ష సంవత్సరాల కిందట విడిపోయినట్టు అధికారులు చెబుతున్నమాట. ఆసియా సింహాలు ఒకప్పుడు మధ్య ప్రాచ్యం నుండి భారత్‌కి తరలి వచ్చాయి. వీటిలో కొన్ని జాతులు అడవుల్లో మనుగడ సాగిస్తున్నాయి.
గిర్ అభయారణ్యంలో సఫారీ చేయాలనుకుంటే ముందుగా జీప్ సఫారీని ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలి. జంగిల్ సఫారీ వైపు వెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు ఉండాలి. ఇక పార్క్ లోపల ధూమపానం, మద్యపానం వాటిని నిషేధించారు.
Here are some more glimpses from Gir. I urge you all to come and visit Gir in the future. pic.twitter.com/IKIFI9hcgI
— Narendra Modi (@narendramodi) March 3, 2025