Congress- Rohit: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్ – న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కివీస్ పై భారత జట్టు 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే భారత బ్యాటర్లను మాత్రం కట్టడి చేయగలిగింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ 17 బంతులలో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Also Read: Champions Trophy 2025: సెమీస్ కు వర్షం ఎఫెక్ట్…టీమిండియాకు భారీ నష్టమేనా ?
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్నెస్ పై కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కెప్టెన్ రోహిత్ శర్మ పై బాడి షేమింగ్ వ్యాఖ్యలు చేసింది షామా మొహమ్మద్. రోహిత్ శర్మ బరువు తగ్గాలని, అతడికి కెప్టెన్సీ అదృష్టంగా దక్కిందని వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షామా మహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్ శర్మని టార్గెట్ చేసి.. ” రోహిత్ శర్మ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిట్నెస్ ఉండదు. ఏదో అదృష్టవశాత్తు రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు.
ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, కపిల్ దేవ్, రవి శాస్త్రి, గంగూలీ లతో పోలిస్తే రోహిత్ శర్మ జస్ట్ యావరేజ్ ఆటగాడు” అంటూ సంచలన ట్వీట్ చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలు, క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోహిత్ శర్మ భారత్ కి ప్రపంచకప్ తీసుకువచ్చాడు.. రాహుల్ గాంధీ సొంత పార్టీని కూడా గందరగోళంలోకి నెట్టాడు అంటూ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.
ఇక బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ” భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని మీరు కోరుకుంటున్నారా..? ” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇలా తీవ్ర విమర్శలు రావడంతో షామా మహమ్మద్ వెంటనే అ ట్వీట్ ని డిలీట్ చేసింది.
Also Read: Gaddafi Stadium: పాకిస్థాన్ పరువు పాయె..స్టేడియంలో అన్ని నీళ్లే..?
అయితే ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలను డిఫెండ్ చేసుకోవడం గమనార్హం. తాను అన్నదాంట్లో తప్పేమీ లేదని చెప్పుకొచ్చింది షామా. తాను అన్న దాంట్లో తప్పేమీ లేదని మరో ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఉందని.. తాను కేవలం రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి మాత్రమే సాధారణ ట్వీట్ చేశానని, ఇది బాడీ షేవింగ్ కాదని చెప్పుకొచ్చింది. అయితే తప్పు లేనప్పుడు ఆ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని నెటిజెన్లు ఆమెపై మండిపడుతున్నారు.
🚨 Congress leader Shama Mohamed : Rohit Sharma is overweight and the most unimpressive captain India has ever had
BJP 🔥 : "Congress hates Indian agencies & organisations. Now, they have started hating Indian cricket team also"
"Comment passed by Congress leader Shama Mohamed… pic.twitter.com/7TFf111kcy
— Times Algebra (@TimesAlgebraIND) March 3, 2025