Kiara Advani – Siddharth Malhotra: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) , ఆమె భర్త ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నామంటూ ఆ శుభవార్తను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మొదటి బిడ్డ కోసం ఎంతగానో కలలు కన్న ఈ జంట.. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం జరిగింది. కియారా అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా ఒక బిడ్డ సాక్స్ ను పట్టుకొని ఉన్న చిత్రాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..” మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో వస్తుంది” అంటూ క్యాప్షన్ జోడించారు.ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఇషాన్ కట్టర్ కూడా “అభినందనలు” అంటూ పోస్ట్ చేశారు. నేహా దూపియాతో పాటు శార్వరీ, విక్రమ్ ఫడ్నిస్ , హుమా ఖురేషి , రియా కపూర్ వంటి తదితరులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి..
బాలీవుడ్ లో స్టార్ కపుల్ గా పేరు దక్కించుకున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం పై కియారా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం గురించి కియారా అద్వానీ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించింది. “సిద్ధార్థ్ మల్హోత్రాతో ఉన్నంతసేపు నాకు ఇంటి మనిషితో ఉన్నట్టు అనిపించేది. ముఖ్యంగా అతనితో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నట్లుగానే భావించాను. ఒక కుటుంబ సభ్యుడి లాగా నన్ను ప్రేమించాడు, ఆదరించాడు. ముఖ్యంగా చాలా ప్రేమగా పెంచిన కుటుంబం నుండి వచ్చాను. ఇక నా కుటుంబ సభ్యులు నన్ను ఎంత ప్రేమగా అయితే చూసుకున్నారో.. అదే ప్రేమను నేను సిద్ధార్థ్ లో కూడా చూశాను. ఇక ఇంతకంటే నాకేం కావాలి. అందుకే నేను అతడి ప్రేమలో పడిపోయాను.” అంటూ సిద్ధార్థ్ తో ప్రేమ గురించి చెప్పి సంబరపడిపోయింది కియారా అద్వానీ.
కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా సినిమాలు..
ముందుగా కియారా సినిమాల విషయానికి వస్తే.. ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదలైన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) కి జోడిగా నటించింది. శంకర్ (Shankar ) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రణవీర్ సింగ్ (Ranvir Singh) తో కలిసి ‘డాన్ 3’లో నటిస్తోంది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా ‘పరమ్ సుందరి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.