BigTV English
Advertisement

AFG vs AUS: డూ ఆర్ డై..ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్.. గత గత వణికి పోతున్న ఆస్ట్రేలియా..!

AFG vs AUS: డూ ఆర్ డై..ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్.. గత గత వణికి పోతున్న ఆస్ట్రేలియా..!

AFG vs AUS: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ జత మధ్య… రసవత్తర ఫైట్ ఉంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్క్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ టీం.. మొదట బ్యాటింగ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ చేయనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లాహోర్ లోని గఢపీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ స్టేడియం లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్.. హష్మతుల్లా షాహీది మొదట బ్యాటింగ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.


 

మొన్న ఇంగ్లాండ్ జట్టు పైన కూడా ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ తీసుకొని రచ్చ చేసింది. ఇంగ్లాండ్ జట్టును చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ చేసింది ఆఫ్గనిస్తాన్. ఇక ఇవాళ కూడా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చాలా కీలకమైనది. ఇందులో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే… ఇంటికి వెళ్లడం గ్యారెంటీ. ఎందుకంటే మొన్న ఇంగ్లాండు పైన గెలిచినప్పుడు కేవలం రెండు పాయింట్లు సంపాదించింది ఆఫ్ఘనిస్తాన్. అటు దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా చెరో మూడు పాయింట్లు సంపాదించుకున్నాయి. కాబట్టి దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా మూడు జట్లకు సెమీఫైనల్ కు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.


 

ఇలాంటి నేపథ్యంలో… ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే… కచ్చితంగా సెమి ఫైనల్ కి వెళుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే నాలుగు పాయింట్లు… కావడం గ్యారెంటీ. అందుకే… ఇంగ్లాండ్ పైన గెలిచినట్లుగానే ఆస్ట్రేలియా పైన గెలవాలని… ప్లాన్ చేస్తోంది ఆఫ్గనిస్తాన్. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే… నేరుగా ఆస్ట్రేలియా సెమీఫైనల్ కి వెళుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా రెండు జట్లు సెమి ఫైనల్ కు వెళ్లే ఛాన్సులు ఉంటాయి.

 

లైవ్, టైమింగ్స్ వివరాలు

చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్  ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ జియో హాట్ స్టార్  లో ఉచితంగా చూడవచ్చు. అయితే జియో సిమ్ ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ అందిస్తుంది రిలయన్స్. జియో హాట్ స్టార్ఏ  కాకుండా స్పోర్ట్స్ 18.. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లలో ఈ మ్యాచ్ లు చూడవచ్చు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు… ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది.

 

 

 

 

 

 

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ(w), గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

 

ఆఫ్ఘనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ

Related News

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Big Stories

×