Odela 2 Story : పూర్తిగా బాలీవుడ్ నటిగా మారిపోయిన తమన్నా చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగులో మూవీ చేస్తుంది. అదే ఓదెల 2. 2022లో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీకి సీక్వెల్‌గా వస్తుందీ మూవీ. ఈ సారి మరింత పకడ్భందీగా స్టోరీ రాశాడు సంపత్ నంది. తమన్నా ఈ మూవీలో అడుగు పెట్టడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే తాజాగా ఈ మూవీ ఫుల్ స్టోరీ లీక్ అయినట్టు తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…
ఓదెల రైల్వే స్టేషన్ మూవీ క్లైమాక్స్‌లో రాధ (హెబ్బ పటేల్) తన భర్త తిరుపతి (వశిష్ట ఎన్. సింహా) చంపేస్తుంది. తలను నరికి… పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. అక్కడితో సినిమా అయిపోతుంది. ఈ ఓదెల 2 మూవీలో దాని కంటిన్యూషన్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.
రాధను చంపే దెయ్యం… ?
ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో చనిపోయిన తిరుపతి… ఈ ఓదెల 2 మూవీలో దెయ్యంగా మారుతడట. తనను చంపిన భార్య రాధపై పగ సాధించడంతో పాటు తిరుపతికి ఉన్న కామ కోరికలను కూడా తీర్చుకుంటాడట. ఆ ఊరిలో అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తూ ఊరిని వల్లకాడు చేస్తాడట. ఈ క్రమంలో హెబ్బ పటేల్ చేస్తున్న రాధ పాత్ర కూడా చనిపోతుందట. దీంతో తిరుపతి దెయ్యం నుంచి ఊరుని ఎవరు కాపాడుతారు అని ఎదురుచూస్తూ ఉంటారట.
తమన్నా పాత్ర ఇదే..?
రాధ చనిపోయిన విషయం వాళ్ల అక్క శివ శక్తి (తమన్నా) కు తెలుస్తుందట. శివ శక్తి ఒక సాధువు. తన చెల్లిని చంపిన వాడిపై రివేంజ్ తీసుకోవాలని, ఆ గ్రామస్తులకు ఆ కామంధుడి నుంచి విముక్తి కల్పించాలని శివ శక్తి అనుకుంటుందట.
ఊరును కాపాడటం..?
ఫైనల్ గా తిరుపతి అనే దెయ్యంపై శివ శక్తి సాధువు రివేంజ్ తీసుకుంటుదట. అలాగే… ఆ ఊరి వాళ్లకు ఆ దెయ్యం నుంచి విముక్తి కల్పిస్తుందట. ఈ క్రమంలో జరిగిన కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ అశోక్ తేజ బాగా తెరకెక్కించాడని సమాచారం..
బిజినెస్ కష్టాలు???
స్టోరీ బాగా రాయడం, సినిమాలో తమన్నా ఉండటంతో… మూవీ రైట్స్ కోసం సంపత్ నంది భారీగా డిమాండ్ చేస్తున్నాట. సాధారణం కంటే… ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో డిస్ట్రిబ్యూటర్లు… ఈ సినిమావైపు తొంగి చూడటం లేదని తెలుస్తుంది. మూవీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. బిజినెస్ అయ్యాకే… రిలీజ్ డేట్ ను ప్రకటించాలని చూస్తున్నారట. కానీ, ప్రస్తుతం సంపత్ నంది… థియేట్రికల్ రైట్స్ కి భారీగా డిమాండ్ చేయడంతో… రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రాలేదు.