Kiccha Sudeep:ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. శాండిల్ వుడ్ లోనే కాకుండా బహుళ భాషల్లో కూడా తన నటనా ప్రతిభతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈరోజు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈరోజును ప్రత్యేక అనుభూతితో ఒక వేడుకలాగా జరుపుకుంటారు సుదీప్. అయితే ఈసారి కూడా ఎప్పటిలాగే అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్టును కూడా పంచుకున్నారు. మరి ఆ పోస్టులో ఏముందో ఇప్పుడు చూద్దాం.
సుదీర్ఘ పోస్ట్ పంచుకున్న సుదీప్..
ఇక సుదీప్ తన 29 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇలా రాసుకువచ్చారు. “ఇండస్ట్రీకి వచ్చి 29 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. నేను చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. ప్రేక్షకులను అలరించడం, ప్రతిధ్వనించే కథలను ఎంచుకోవడం చాలా గౌరవంగా ఉంది. నాకు లభించిన ప్రేమ, మద్దతుకి రుణపడి ఉంటాను. ఇంత అంకితభావంతో కూడిన అభిమానులు నాకు నిజంగా ఉండడం అదృష్టం” అంటూ సుదీప్ తెలిపారు.
కిచ్చా సుదీప్ సినీ ప్రయాణం..
ఇకపోతే జనవరి 31 1996వ తేదీన బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్ లో ‘బ్రహ్మ’ అనే సినిమాతో ఈయన కెరియర్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమా పూర్తి కాలేదు. ఈ సినిమా సుదీప్ మొదటి సినిమా స్థానాన్ని కూడా అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆ సుదీర్ఘ ప్రయాణానికి 29 సంవత్సరాలు. మరో సంవత్సరము గడిస్తే.. సుదీప్ చిత్ర పరిశ్రమలో మూడు అద్భుతమైన దశాబ్దాలు పూర్తి చేసినట్లు అవుతుంది. శివ మొగ్గలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ఈయన, చిన్నప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీపై మక్కువ పెంచుకున్నారు. అందుకే ఇండస్ట్రీలోకి బ్రహ్మ సినిమాతో రావాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ‘తాయవ్వ’ అనే సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత విడుదలైన ‘స్పర్ష్’ చిత్రం మాత్రం క్లాసిక్ హిట్ అందించింది. 2001లో ‘హుచ్ఛా’ అనే సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని, ఇక అప్పటినుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం కన్నడలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు .నటుడిగానే కాకుండా నిర్మాతగా, గాయకుడిగా, దర్శకుడిగా కూడా తనలోని ప్రతిభ కనబరిచారు.
ఒక్క సినిమాతో మూడు అవార్డులు..
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఈగ’ అనే సినిమా ద్వారా పరిచయమై, భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈయన, 2012లో ఈగ సినిమాకి గానూ నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అదే సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు కూడా లభించింది. అంతేకాదు ఉత్తమ ప్రతినాయకుడి విభాగంలో సైమా అవార్డు లభించడం గమనార్హం. టీవీ హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ షో నుండి తప్పుకోవడం జరిగింది.
29 years,,,
I feel an immense sense of gratitude for the journey I’ve experienced. It’s been an honor to entertain audiences and share stories that resonate with so many. The love and support I have received from all of you have been a constant source of motivation, and I am…— Kichcha Sudeepa (@KicchaSudeep) January 31, 2025