OTT Movies : ఇటీవల కాలంలో ఓటీడీలో సరికొత్త కంటెంట్లతో కొత్త కొత్త మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని అందుకోవడం పక్క థియేటర్లలో అంతగా ఆకట్టుకొని సినిమాలు కూడా ఇక్కడ భారీ రెస్పాన్స్ ని అందుకోవడం తథ్యం. అందుకే కొన్ని సినిమాలు థియేటర్ల మీద నమ్మకం పెట్టుకోకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి.. ఇక స్టార్ హీరోలు ప్రధాన పాత్రలో నటించిన కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ల వద్ద డల్ అయితే అప్పుడు ఓటిటిలో దర్శనమిస్తున్నాయి. అది సినిమాలు ఏకంగా రెండు నెలల తర్వాత కూడా ఓటీటీలోకి రాలేకపోతున్నాయి.. సిని లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఓటిటి సంస్థలు కొత్త సినిమాలతో పాటు కొన్ని సినిమాలను డైరెక్ట్గా ఓటీటీలోకి తీసుకొస్తున్నాయి.. తాజాగా లవ్ స్టోరీ మూవీ డైరెక్ట్ గా ఓటిటిలోకి రాబోతుంది.. ఆ మూవీ పేరేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మూవీ& ఓటీటీ..
ఈ మూవీ తెలుగు కామెడీ లవ్ జానర్ లో రాబోతుంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ తెలుగు మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ పేరు అది ఒక ఇదిలే.. ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తో పాటుగా 99 రూపాయలు రెంటల్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్‌తో బీసీఐనీట్ ఓటీటీలో కూడా అది ఒక ఇదిలే మూవీ స్ట్రీమింగ్ అవుతోంది..
ఇక మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఇది ఒక రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ మూవీ.. ఈ మూవీలో సబ్యసాచి మిశ్రా, రాధిక ప్రీతి హీరోహీరోయిన్లుగా నటించారు. రక్ష భవానీ, శ్యామ్ తేజో వికాస్ కీలక పాత్రల్లో నటించారు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ తెలుగు మూవీ రిలీజైనట్లు సమాచారం. తమిళంలో నాదిర్ దిన్నా పేరుతో 2022లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అక్కడ మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది… ప్రేమ ప్రేమతో పాటు స్నేహం అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందని అర్థమవుతుంది. సిద్ధు, బుజ్జి చిన్ననాటి మిత్రులు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటుంటారు. ఇద్దరు ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. సిద్ధును బుజ్జి ఇష్టపడుతుంది. ఈ ప్రేమ కారణంగా సిద్ధుకు, బుజ్జి అన్నయ్యకు మధ్య గొడవలు మొదలవుతాయి. ఒకప్పుడు ప్రాణ మిత్రులుగా ఉండి ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేలా ఉన్నా స్నేహితులు గొడవల వల్ల విడిపోతారు. శత్రువులుగా మారతారు.. మరి బుజ్జి సిద్ధూ ప్రేమ ను గెలిపించుకుంటారా లేదా ఇద్దరు విడిపోయి దూరంగా ఉంటారా అన్నది ఈ మూవీ స్టోరీ.. తమిళంలో పర్వాలేదు అనిపించిన ఈ మూవీ తెలుగులో ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..