BigTV English

Viral video: టైబుల్ మీద 70 కోట్లు, కావలసినంత తీసుకోండి.. కానీ, ఓ కండీషన్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

Viral video: టైబుల్ మీద 70 కోట్లు, కావలసినంత తీసుకోండి.. కానీ, ఓ కండీషన్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

పలు కంపెలు తమ ఉద్యోగులకు పలు సందర్భాల్లో బోనస్ లు ఇస్తుంటాయి. పండుగలు, వార్షికోల్సవాల సందర్భంగా ఇంక్రిమెంట్లు అందిస్తాయి. కంపెనీ ఇచ్చే బోనస్ లు, ఇంక్రిమెంట్లు ఉద్యోగులలో మరింత బాగా పని చేయాలనే ఆసక్తి కలిగిస్తాయి. ఫలితంగా కంపెనీ మంచి లాభాలు సాధిస్తుంది. తాజాగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్ ఇచ్చింది. టేబుల్ మీద కోట్ల రూపాయలు కుమ్మరించి.. కావాలిసినంత తీసుకోవాలని చెప్పింది. కానీ, ఓ చిన్న కండీషన్ పెట్టింది. ఇంతకీ అదేంటంటే..


చైనా కంపనీ అదిరిపోయే ఆఫర్

చైనాకు చెందిన హెనాన్ మైనింగ్ క్రేన్ కో అనే లిమిటెడ్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని ఆఫర్ ఇచ్చింది. కంపెనీ లాభాల్లో ఉద్యోగులు ఎంతగానో కష్టపడుతున్నారనే ఉద్దేశంతో వారిని ఖుషీ చేయాలనుకుంది. ప్రపంచంలో ఎవరూ ఊహించని రీతిలో వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగుల ముందు పొడవైన టేబుల్ ఏర్పాటు చేసింది. దానిమీద సుమారు 100 మిలియన్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 70 కోట్లను పరిచింది. టేబుల్ చుట్టూ ఉద్యోగులను నిల్చోబెట్టింది. కావాల్సినంత డబ్బు తీసుకోవాలని ఆఫర్ ఇచ్చింది. అయితే, వారికి ఓ కండీషన్ పెట్టింది. ఇంతకీ అదేంటంటే..


కేవలం పావు గంట టైమ్ ఇచ్చిన కంపెనీ!

ఉద్యోగులకు 15 నిమిషాల టైమ్ ఇచ్చింది కంపెనీ. ఈ 15 నిమిషాల్లో ఎంత లెక్కిస్తే అంత డబ్బు ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పింది. కంపెనీ చెప్పినట్లుగానే పావుగంటలో ఒక్కో ఉద్యోగి లెక్కించినంత డబ్బును సొంతం చేసుకున్నారు. అయితే, కొంత మంది ఈజీగా డబ్బులను లెక్కిస్తే, మరికొంత మంది డబ్బులు లెక్కపెట్టడంలో ఇబ్బంది పడ్డారు. కొంత మంది మాత్రం చాలా ఫాస్ట్ గా ఎక్కువ డబ్బును సొంతం చేసుకున్నారు. కంపెనీ ఉద్యోగులలో ఒకరు పావుగంటలో అత్యధికంగా రూ. 12.7 లక్షలు దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ బంపర్ ఆఫర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇలాంటి అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన కంపెనీని అందరూ మెచ్చుకుంటున్నారు.

Read Also: రైల్వేకు ఝలక్.. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలంటూ ప్రయాణీకుడు డిమాండ్!

సోషల్ మీడియాలో వీడియో వైరల్

అటు ఈ బంఫర్ ఆఫర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. కంపెనీలు ఇలా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి ఆఫర్ మరే ఉద్యోగి చూసి ఉండరు అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, డబ్బుకు తగినట్లే ప్రెజర్ ఉంటుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సుమారు 2 మిలియన్ల వ్యూస్ సాధించింది.

అటు ఇండియాలోనూ కొన్ని కంపెనీల ఓనర్లు తమ ఉద్యోగులకు విలువైన కార్లు, ద్విచక్రవాహనాలు బహుమతిగా ఇచ్చిన సందర్భాలున్నాయి. సూరత్ లోని ఓ వజ్రాల వ్యాపారి తన ఉద్యోగులకు కార్లు అందించారు. చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు  కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచింది.

Read Also: రైలు ఆలస్యమైందనే కోపంతో.. ఏకంగా సొంత రైల్వే సంస్థను పెట్టేశాడు!

Read Also: కాశ్మీర్‌ TO కన్యాకుమారి రైల్వే లైన్.. దశాబ్దాల కల నిజం కాబోతుందన్న రాష్ట్రపతి

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×