BigTV English

Kichacha Sudheep: 2209లో జరిగే స్టోరీతో కిచ్చా సుదీప్ మూవీ.. స్టోరీ మొత్తం ట్విస్టులే..

Kichacha Sudheep: 2209లో జరిగే స్టోరీతో కిచ్చా సుదీప్ మూవీ.. స్టోరీ మొత్తం ట్విస్టులే..

Kichacha Sudheep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోని అందరికి ఈయన తెలుసు. తెలుగులో రాజమౌళి తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఈగ మూవీలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి యావత్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విక్రాంత్ ద్రోణ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత అదే దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


బిల్లా రంగాగా కిచ్చా సుదీప్.. 

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఏకైక స్టార్ కిచ్చా సుదీప్.. గత ఏడాది ‘మ్యాక్స్’ మూవీతో వచ్చాడు. అది పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను విజయ్ కార్తికేయ తెరకెక్కించారు. డిసెంబర్‌లో థియేటర్స్‌లోకి వచ్చి హిట్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కిచ్చా సుదీప్ ‘బీఆర్‌బి: ఫస్ట్ బ్లడ్'(బిల్లా రంగా భాషా) సినిమాను ప్రకటించారు. అయితే ఈ సినిమా అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ విడుదలై చాలా నెలలు అవుతున్నప్పటికి దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు. అయితే ఇన్నాళ్లకు హీరో కిచ్చా సుదీప్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘బీఆర్‌బి’ సినిమాకు సంబంధించిన షూట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఇక ఇందులో ఆయన గుబురు గడ్డంతో కోపంగా చూస్తూ కనిపించారు. ఈ పోస్ట్‌కు మా ప్రయాయణం ఈరోజు నుంచి ప్రారంభం కాబోతుంది. మా బృందానికి నేలపైకి వెళ్లడం ఒక అసమానమైన ఉత్సాహంను కలిగిస్తోంది అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ సినిమాలను మిస్ అవ్వకండి..

స్టోరీ విషయానికొస్తే.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కొత్త శకానికి నాంది పలుకుతూ ‘బిల్లా రంగ బాషా’ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 ఎడి భవిష్యత్తు లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.. మొత్తానికి సుదీప్ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈ మూవీ హిట్ అయితే మాత్రం అతని రేంజ్ ఎక్కడికో వెళ్తుందని తెలుస్తుంది.. చూడాలి మరి.. అతని లైఫ్ ఈ మూవీతో ఎలా మారుతుందో.. ఏది ఏమైనా కిచ్చా సుదీప్ ఫామ్ లోకి వచ్చేసాడు..

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×