E-Paper
Advertisement

Kichcha Sudeep:- కిచ్చా సుదీప్ షాకింగ్ డెసిష‌న్‌.. సినిమాల‌కు బ్రేక్‌

Kichcha Sudeep:- కిచ్చా సుదీప్ షాకింగ్ డెసిష‌న్‌.. సినిమాల‌కు బ్రేక్‌
Advertisement

Kichcha Sudeep:- క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈగ చిత్రంతో క‌రుడుగ‌ట్టిన విల‌న్‌గా అంద‌రినీ ఆయ‌న మెస్మరైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత బాహుబ‌లి చిత్రంలోనూ చ‌టుక్కున మెరిశాడు. మ‌న తెలుగు సినిమాల‌ను క‌న్న‌డ‌లో రీమేక్ కూడా చేస్తుంటారు సుదీప్‌. ఆయ‌న హీరోగా న‌టించిన‌ ప‌హిల్వాన్‌, విక్రాంత్ రోణ చిత్రాలు క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ ఏక కాలంలో రిలీజ్ అవుతున్నాయి.

విక్రాంత్ రోణ త‌ర్వాత క‌బ్జ సినిమాలో సుదీప్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ నేప‌థ్యంలో కిచ్చా సుదీప్ త‌న అభిమానుల కోసం ఓ ప్రెస్ నోట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇంత‌కీ ఆ ప్రెస్ నోట్‌లో ఏం పేర్కొన్నారో తెలుసా!.. సినిమాల నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నార‌ట‌. ‘హాయ్ ఫ్రెండ్స్ మీరు కిచ్చా 46 గురించి మాట్లాడుతుండటం దానికి సంబంధించిన ట్వీట్స్, మీమ్స్ చూశాను. మీరు నన్నలా పిలవటం నాకు కొత్తగా, స్పెషల్‌గా ఉంది. ప్ర‌స్తుతం కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాల‌ని అనుకుంటున్నాను. విక్రాంత్ రోణ‌, బిగ్ బాస్ క‌న్న‌డ‌, సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ ఆస్వాదించాను.

Advertisement

ప్ర‌స్తుతం మూడు సినిమాల‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ల‌ను ఓకే చేశాను. వాటికి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ లోపు నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను. కెరీర్ ప‌రంగా ఇది నా తొలి బ్రేక్‌. త్వ‌ర‌లోనే అప్‌డేట్స్‌కి సంబంధించి మీ ముందుకు వ‌స్తాను’ అన్నారు. ఈ పోస్ట్ చూసిన కిచ్చా సుదీప్ అభిమానులు త‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

సెలబ్రిటీల క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్‌ని కిచ్చా సుదీప్ లీడ్ చేశారు. కానీ.. ఈ జట్టు తెలుగు వారియర్స్‌ చేతిలో ఓడిపోయింది.

Advertisement

‘సలార్’ ఓవర్ సీస్ హక్కులు.. ప్రభాస్ లెక్కే వేరు!

for more updates follow this link:-Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×