Big Stories

SRH Vs RR : రాయల్స్ జోరు.. సన్ రైజర్స్ బేజార్..

SRH Vs RR : సొంతగడ్డపై జరిగిన తొలిపోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. 204 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కు తొలి ఓవర్ లోనే షాక్ తలిగిలింది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసి ట్రెంట్ బౌల్ట్ దెబ్బకొట్టాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే సన్ రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

- Advertisement -

భారీ అంచనాలతో క్రీజులో వచ్చిన హ్యారీ బ్రూక్ పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. చివరకు బ్రూక్ (21 బంతుల్లో 13 రన్స్ ) చాహల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ (1), గ్లెన్ ఫిలిప్స్ (8), మయాంక్ అగర్వాల్ (27) వెంటవెంటనే అవుట్ కావడంతో సన్ రైజర్స్ 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో రాజస్థాన్ గెలుపు లాంఛనమేనని తేలిపోయింది. ఇంపాక్ట్ ఫ్లేయర్ అబ్దుల్ సమద్ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సుతో 32 నాటౌట్ ), అదిల్ రషీద్ ( 13 బంతుల్లో ఫోర్, సిక్సుతో 18 రన్స్ ) ఉమ్రాన్ మాలిక్ ( 8 బంతుల్లో ఫోర్, 2 సిక్సులతో 19 నాటౌట్) మెరవడంతో హైదరాబాద్ స్కోర్ వంద దాటింది. చివరకు హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. దీంతో 72 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలిచింది.

- Advertisement -

రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆరంభంలో బౌల్ట్ షాక్ ఇస్తే మిడిల్ ఆర్డర్ ను చాహల్ , అశ్విన్, హోల్డర్ కూల్చేశారు. చాహల్ కు 4 వికెట్లు, బౌల్ట్ కు 2 వికెట్లు, అశ్విన్,హోల్డర్ కు తలో వికెట్ దక్కాయి.

టాస్ గెలిచి తొలుత హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్ ( 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 54 రన్స్), యశస్వి జైస్వాల్ ( 37 బంతుల్లో 9 ఫోర్లతో 54 రన్స్) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 85 పరుగులు జోడించిన తర్వాత బట్లర్ అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ సంజు శాంసన్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 55 రన్స్ ), జైస్వాల్ జోడి అదే జోరు కొనసాగించడంతో రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. చివరిలో హెట్ మైయర్ ( 16 బంతుల్లో ఫోర్, సిక్సుతో 22 నాటౌట్ ) మెరవడంతో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.

హైదరాబాద్ బౌలర్లు రాజస్థాన్ బ్యాటర్లను ఏ మాత్రం అడ్డుకోలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫరూఖీ, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్ కు ఒక వికెట్ దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News