Ram Charan: టాలీవుడ్ లో స్టార్ హీరోస్ ఒక పెద్ద పాన్ ఇండియా హిట్ కొట్టగానే.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఊవిళ్లురూతూ ఉంటారు. అక్కడ కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. స్టార్ డైరెక్టర్స్ తో ఒక ప్రాజెక్ట్ ను సెట్ చేయించుకోవడానికి ముంబైకి వెళ్ళివస్తూ ఉంటారు. ఇక ఈలోపే.. ఆ డైరెక్టర్ తో హీరో సినిమా చేస్తున్నడాట.. ఈ డైరెక్టర్ ను సెట్ చేసుకున్నాడని వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఎన్టీఆర్.. వార్ 2 లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ పంచుకుంటున్నాడు.
ఇక ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమా డైరెక్టర్ తో చరణ్ సినిమా చేస్తున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీతో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత మరొక డైరెక్టర్ తో.. ఇక ఈ మధ్య కిల్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు నిఖిల్ నగేష్. లక్ష్య, రాఘవ్ జుయల్, తాన్య మానిక్తలా, అభిషేక్ చౌహాన్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన కిల్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Meenaakshi Chaudhary: అబ్బబ్బా.. ఏం పిల్లరా బాబు.. ఆ అందం.. అస్సలు పోవడం లేదు మైండ్ లో నుంచి
ఇక కిల్ తరువాత నిఖిల్.. ఒక మైథలాజికల్ సినిమా కోసం కథను ప్రిపేర్ చేస్తున్నాడని, ఆ సినిమాకోసం రామ్ చరణ్ ను సంప్రదించాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిఖిల్ ఖండించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ” నేను చరణ్ తో ఎలాంటి సినిమా కమిట్ అవ్వలేదు. మా కాంబోలో ఒక సినిమా వస్తుంది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మైథలాజికల్ కాదు యాక్షన్ సినిమానే చేస్తున్నాను. దానికి మించి ఎక్కువ వివరాలను చెప్పలేను. కానీ, ఇందులో ఎమోషనల్ డెప్త్ మరింత ఎక్కువగా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ RC16తో బిజీగా మారాడు. బుజ్జిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత అంతకు మించిన సినిమాతో చరణ్ వస్తాడు అనుకుంటే గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకులను నిరాశపరిచాడు. దీంతో ఆ సినిమా ప్లాప్ ను మరిపించాలి అంటే.. RC16 అదిరిపోవాలి.
ఇక RC16 ను కూడా బుచ్చిబాబు బాగానే రెడీ చేస్తున్నాడని టాక్. రంగస్థలం తరువాత అలాంటి లుక్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా తరువాత అయినా చరణ్ బాలీవుడ్ పై ఫోకస్ పెడతాడా.. ? లేదా… ? అనేది చూడాలి.