BigTV English
Advertisement

Train Rules In World: కోడికి టికెట్ తియ్యాలి, ఐస్ క్రీమ్ తినకూడదు.. ఈ ఫన్నీ రైల్ రూల్స్ తెలుసా?

Train Rules In World: కోడికి టికెట్ తియ్యాలి, ఐస్ క్రీమ్ తినకూడదు.. ఈ ఫన్నీ రైల్ రూల్స్ తెలుసా?

Big Tv Live Original: ప్రపంచ వ్యాప్తంగా ప్రజా రవాణాలో రైల్వే వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను ఆహ్లాదకరంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. కానీ, కొన్ని రైల్వే రూల్స్ చాలా వింతగా ఉన్నాయి. అదే సమయంలో ఫుల్ ఫన్నీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని నవ్వుతెప్పించే రైల్వే రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ ప్లాట్‌ ఫారమ్‌ పై ముద్దు పెట్టుకోవద్దు!  

ఫ్రాన్స్, బ్రిటన్ లో ఓ ఆశ్చర్యక రూల్ ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ మీద ముద్దు పెట్టుకోవడం నిషేధం. సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన బంధువులు హగ్గులు, ముద్దుల ఇవ్వడం వల్ల ప్రయాణీకులు రైళ్లను మిస్ అవుతున్నారట. అందుకే ప్లాట్ ఫారమ్ మీద వీటిని నిషేధించారు.


⦿ కోళ్లకు టికెట్ ఉండాల్సిందే!

జర్మనీ రైళ్లలో పిల్లులు, కుక్కలు లాంటి పెంపుడు జంతువులను ఫ్రీగా తీసుకెళ్లవచ్చు. కానీ, కోళ్లకు మాత్రం కచ్చితంగా హాఫ్ టికెట్ తీసుకోవాలి. జర్మనీ రైల్వే రూల్స్ ప్రకారం పక్షులను తీసుకెళ్లే వాళ్లు వాటికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

⦿ రైళ్లలో ఐస్ క్రీం తినకూడదు

సింగపూర్ లోని రైళ్లలో ఫుడ్, డ్రింక్స్ తీసుకోవచ్చు. కానీ, ఐస్ క్రీమ్ మాత్రం తినకూడదు. ప్రయాణ సమయంలో ఇతర ప్రయాణీకులకు అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.

⦿ మద్యం తాగి రైళ్లోకి ఎక్కకూడదు

ఇక జపాన్ లో మద్యం తాగి రైళ్లోకి ఎక్కడాన్ని నిషేధించారు.  అయితే, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా రైళ్లోకి ఎక్కి సైలెంట్ గా ఉంటే ఫర్వాలేదు.

⦿ రైల్లో పాట పాడకూడదు

ఇక కెనడాలో అనుమతి లేకుండా రైళ్లలో పాడటం లేదంటే మ్యూజికల్ వాయిద్యాలు ఉపయోగించడంపై బ్యాన్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తారు.

⦿ జాంబీస్ పట్ల జాగ్రత్త  

అమెరికాలోని కొన్ని చిన్న పట్టణాలకు వెళ్లే రైళ్లలో మృతదేహాలను రవాణా చేయకూడదు అనే రూల్ ఉంది. తప్పని పరిస్థితులలో తీసుకెళ్లాలంటే వీకెండ్ లో ప్లాన్ చేసుకోవాలి.

⦿ కచ్చితంగా ప్యాంట్ వేసుకోవాలి

అమెరికాలోని న్యూయార్క్  సబ్‌ వేలలో రైలు ప్రయాణం చేయాలంటే కచ్చింతగా ఫ్యాంట్ వేసుకోవాలి. కానీ, ఈ నియమాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఏటా ‘నో ప్యాంట్స్ సబ్‌ వే రైడ్’ నిర్వహిస్తారు ప్రయాణీకులు.

⦿ వాసన వచ్చే చేపలను తీసుకెళ్లవద్దు

ఆస్ట్రేలియాలోని రైళ్లలో వాసన వచ్చే చేపలను రవాణా చేయడం నిషేధించారు.

⦿ స్టేషన్‌ లో నిద్రపోకూడదు

కొన్ని UK రైల్వే స్టేషన్లలో బెంచీలపై ఎక్కువసేపు నిద్రపోకూడదనే నియమం ఉంది.

Read Also: రైలును ధ్వంసం చేస్తే ఇండియాలో ఏ శిక్ష విధిస్తారు? ఆ దేశంలో ఏకంగా టాయిలెట్లు కడిగిస్తారు!

⦿ రైలు మీదికి ఎక్కి ప్రయాణించకూడదు

ఇండియా, ఇండోనేషియాలో ప్రయాణీకుల భద్రత పట్ల ప్రభుత్వాలు కీలక చర్యలు తీసుకుంటాయి. అందులో భాగంగానే రైళ్లపైకి ఎక్కి ప్రయాణించడాన్ని నిషేధించాయి.

Read Also: ఆవిరి రైలు ఇంజిన్ల నుంచి అత్యాధునిక వందేభారత్ వరకు.. భారతీయ రైల్వే కళ్లు చెదిరే అభివృద్ధి!

Read Also: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. అప్పట్లో ఒకటే హాల్ట్, ఇప్పుడు యావత్ భారతావనికి గమ్యస్థానం!

Related News

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Big Stories

×