BigTV English
Advertisement

Laila: భారీ దెబ్బ కొట్టిన విశ్వక్ లైలా.. భోజనాల ఖర్చులు కూడా రాలేదా..?

Laila: భారీ దెబ్బ కొట్టిన విశ్వక్ లైలా.. భోజనాల ఖర్చులు కూడా రాలేదా..?

Laila.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మాస్ హీరోగా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. తొలిసారి లేడీ గెటప్ లో నటించిన చిత్రం లైలా (Laila) . ఈ సినిమా విడుదలకు ముందు సినిమా నుండి విడుదల చేసిన టీజర్, పోస్టర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెంచేశాయి. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ (Prudhvi Raj) మాట్లాడిన మాటలు సినిమాపై పూర్తి నెగిటివిటీని క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. దీనికి తోడు మిడిల్ ఫింగర్ చూపిస్తూ విశ్వక్ చేసిన పోస్ట్ కూడా సినిమాపై నెగెటివిటీని పెంచింది. దెబ్బకు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎలా అంటే కనీసం భోజనాల ఖర్చులు కూడా రాలేదట. ఇక దీని బట్టి చూస్తే విశ్వక్ లైలా మూవీకి ఎంత దెబ్బ పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


వైరల్ గా మారిన లైలా కలెక్షన్స్..

ప్రముఖ డైరెక్టర్ రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వంలో సాహూ గారపాటి (Sahoo Garapati) నిర్మించిన చిత్రం లైలా. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు రోజులు అవుతోంది. ఇక నాలుగవ రోజు అయిన ఈరోజు మొదటి రెండు షోలలో కేవలం రూ.7 లక్షలు మాత్రమే కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు రూ.కోటి 40 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండవ రోజు రూ.60 లక్షలు, మూడవరోజు రూ.65 లక్షలు మాత్రమే సంపాదించింది. ఇక ఓవరాల్ గా నాలుగు రోజుల్లో కేవలం రూ. 2.72 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి రూ.40 కోట్లు బడ్జెట్ కేటాయించామని నిర్మాత సాహు గారపాటి వెల్లడించిన విషయం తెలిసిందే.


హీరోకు పెట్టిన ఖర్చులు కూడా రాలేదా..

ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇంత డిజాస్టర్ అవడంతో మరికొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. హీరోకు పెట్టిన ఖర్చులు కూడా రాలేదని, దీనికి తోడు విదేశాల్లో షూటింగ్ చేశారట. వేరే దగ్గర షూట్ చేయడం వల్ల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అందుకే కనీసం భోజనాల ఖర్చులు కూడా రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో రెమ్యూనరేషన్ కాకుండా విశ్వక్ సేన్ కోసం పర్సనల్ గా పెట్టిన ఖర్చులు కూడా వెనక్కి రానట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే విశ్వక్సేన్ లైలా మూవీ ఏ రేంజ్ లో డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ ఇయర్ విడుదలైన చిత్రాలలో అతిపెద్ద డిజాస్టర్ కూడా ఇదే కావడం గమనార్హం. ఏదిఏమైనా విశ్వక్ మూవీకి ఇంత భారీ నష్టం కలగడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

విశ్వక్ సేన్ సినిమాలు..

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వక్ సేన్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు, స్క్రీన్ ప్లే, రచయిత కూడా.. దినేష్ నాయుడు అయిన విశ్వక్ సేన్ గా తన పేరును మార్చుకొని.. ఇండస్ట్రీలోకి అడుగు ఫలక్నామా దాస్ , వెళ్ళిపోమాకే, ముఖచిత్రం, హిట్ , ఈ నగరానికి ఏమైంది ,అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, పాగల్, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు లైలా చిత్రంతో కోలుకోలేని దెబ్బ పడిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×