Shobhita dhulipala.. శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala).. ప్రస్తుతం ఈ హీరోయిన్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు శోభిత దూళిపాళ్ల అంటే ఏదో కొద్దిమందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయో అప్పటి నుండి ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. ఇక అక్కినేని కోడలు అయిపోయాక మరింత ఫేమస్ అయింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా శోభిత ధూళిపాళ్లకి పేరుంది. ఇక శోభిత దూళిపాళ్ల పుట్టింది ఏపీలోనే అయినప్పటికీ ఆమెకు బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. అలా బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించిన శోభిత తెలుగులో ‘మేజర్’, ‘గూడచారి’ వంటి సినిమాలతో ఫేమస్ అయింది. అయితే అలాంటి శోభితా ధూళిపాళ్ల గత ఏడాది నాగచైతన్య(Naga Chaitanya)ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే పెళ్లయిన రెండు నెలలకే శోభిత ధూళిపాళ్ల అందరూ షాక్ అయ్యే ఒక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ శోభిత ధూళిపాళ్ల తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
మెగా కోడల్ని ఫాలో అవుతున్న అక్కినేని కోడలు..
చాలామంది హీరోయిన్లు పెళ్లయ్యాక తమ కల్చర్ ని మార్చుకుంటూ ఉంటారు. కొంతమందేమో పెళ్లయ్యాక కూడా బోల్డ్ పాత్రలు చేస్తే.. మరికొంత మందేమో పెళ్లయ్యాక ఫ్యామిలీకి చెడ్డ పేరు రాకూడదని హద్దుల్లో ఉంటూ సాంప్రదాయమైన రోల్స్ మాత్రమే చేస్తారు. అయితే శోభిత ధూళిపాళ్ల కూడా హీరోయిన్ కాబట్టి పెళ్లయ్యాక మరో హీరోయిన్ ని ఫాలో అవుతోందట. ఇక ఆ హీరోయిన్ ఎవరంటే మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).. వరుణ్ తేజ్ (Varun Tej) ని పెళ్లి చేసుకున్నాక లావణ్య త్రిపాఠి చాలా రోజుల నుండి సినిమాలు చేయడం లేదు. ఇక ఈ మధ్యనే ఒక సినిమాని అనౌన్స్ చేసింది.అయితే సినిమాలు చేసినా కూడా అలాంటి పాత్రల్లో నటించకూడదని ఆమె ఫిక్స్ అయిందట. అయితే అచ్చం లావణ్య త్రిపాఠి లాగే శోభిత ధూళిపాళ్ల కూడా ఆమెని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పెళ్లయ్యాక శోభిత ధూళిపాళ్ల కూడా పాత్రలు వదిలేసి ప్రాధాన్యత ఉన్న పాత్రలు, సాంప్రదాయమైన పాత్రలు మాత్రమే చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
అలాంటి పాత్రలకు దూరం అంటున్న శోభిత..
ఇక పెళ్లికి ముందు చేసినట్టు అలాంటి పాత్రల్లో నటించకుండా తన పాత్రకు ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ నే చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాను బోల్డ్ పాత్రల్లో నటించి అక్కినేని ఫ్యామిలీ పరువు తీయకూడదని శోభిత ధూళిపాళ్ల ఫిక్స్ అయిందట. అందుకే పెళ్లయ్యాక తన ఫ్యామిలీ పరువు పోకుండా కాపాడే బాధ్యత తనదే అని శోభిత ధూళిపాళ్ల తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తన దగ్గరికి సినిమా కోసం వచ్చే డైరెక్టర్లకి కూడా అలాంటి పాత్రల్లో నటించనని కరాఖండిగా చెప్పేస్తుందట. ఇక శోభిత ధూళిపాళ్ల తీసుకున్న నిర్ణయానికి చాలామంది అక్కినేని ఫ్యాన్స్ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.