KCR BIRTHDAY: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరపడం వివాదాస్పదంగా మారింది. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినా పురంలోని నందనవనం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మాజీ కార్పొరేటర్ పద్మనాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అయితే, ఈ స్కూల్ కు సంబంధించి ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు సైతం వెల్మ కులానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కాగా ఒక మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరగడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంచితే స్వీట్లు పంచితే తప్పులేదు కానీ వేడుకలు జరపడం విద్యార్థులతో జేజేలు కొట్టించడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా కేసీఆర్ పుట్టినరోజు జరపడం పై స్కూల్ ప్రిన్సిపల్ పైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ALSO READ: KCR BIRTHDAY: మా నాన్న తెలంగాణ హీరో.. KTR ఎమోషనల్ ట్వీట్
కాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరిపాయి. కేసీఆర్ జన్మదిన వేడుకలు భువనగిరి పట్టణంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాధించడంతో పాటు రాష్ట్ర రూపురేఖలను మార్చేసిన ఘనత మాజీ సీఎం కేసిఆర్ కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. తెలంగాణకు మార్గదర్శి, జాతిపిత కేసీఆర్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ALSO READ: Rajasingh vs Bandi Sanjay: హైకమాండ్ సీరియస్.. కావాలనే రాజాసింగ్‌ను సైడ్ చేస్తున్నారా?
తెలంగాణ ఉన్నంతకాలం ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లబ్ధి పొందాయన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, పార్టీ నాయకులు కొలుపుల అమరేందర్, ఏవీ కిరణ్, ఎనబోయిన ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.