Kiraack Boys Khiladi Girls 2 : బుల్లితెర లో టాప్ గేమ్ షోస్ లో స్టార్ మా లో వస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 ఒకటి. గత ఏడాది మొదలైన ఈ గేమ్ షో సీజన్ వన్ ప్రేక్షకులు ఎంతగానో అలరించింది. దానికి సీక్వెల్ గా ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీజన్ 2 టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. తాజాగా శని ఆదివారాల్లో టెలికాస్ట్ అయ్యే ఫుల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో పృద్వి పై విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
పృథ్వీ బాత్రూం విషయాలు బయటపెట్టిన విష్ణుప్రియ…
స్టార్ మా లో ప్రతి శని ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, స్టార్ యాంకర్ అనసూయ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. శ్రీముఖి యాంకరింగ్ లో ఈ షో ప్రసారమవుతుంది. తాజాగా ఈ షో ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమోలో మొదట శ్రీముఖి ఫెస్టివల్ సీజన్స్ సందర్భంగా ఇక పండగే అంటూ ప్రోమో స్టార్ట్ అవుతుంది. కష్టంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిస్తారు. శ్రీముఖి పృద్వి ఈ సెట్ లో ఎవరిని చూస్తే, లడ్డు లా వుంది అనిపిస్తుంది అని అడగ్గావిష్ణు ప్రియ అని ఆన్సర్ చేస్తాడు. శ్రీముఖి విష్ణు నువ్వు లడ్ల ఉంటావంట అని గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే పృద్వి విష్ణు ప్రియ డాన్స్ చేస్తారు. శేఖర్ మాస్టర్ పృథ్వి కూడా డాన్స్ చేస్తే బాగుండేది అని అంటాడు. వెంటనే విష్ణు ప్రియ అతను వేరే చోట, బాత్రూం లో డాన్స్ చేస్తాడు అని అంటుంది. వెంటనే పృథ్వి ఏంటి అనగా జోక్ చేశాను అని విష్ణు ప్రియ కవర్ చేస్తుంది. ఇప్పటికే ఈ షోలో అనసూయను పృద్వి ఎత్తుకోవడం, అనసూయ షాక్ అవడం ఆ గోల ఆల్రెడీ ఓ ప్రోమోలో రిలీజ్ చేశారు. ఇది చూసిన వారందరూ నాకేంటి రా బాబు ఈ కర్మ అనుకునే విధంగా ప్రోమో సాగింది. ఎక్కడెక్కడ విషయాలన్నీ ఇలా షోలో మాట్లాడడం అసహ్యంగా ఉందంటూ, ప్రైవసీగా మాట్లాడుకునే విషయాలను బయటపెడుతున్నారంటూ ఇదేం కర్మ బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ప్రోమోలో..
ఇక ఈ ప్రోమోలో రోహిణి, ఇమ్మానియేల్ మధ్య గొడవ జరిగినట్టు చూపిస్తారు. శ్రీముఖి పండగకు ఏం తెచ్చుకుంటావు అని రోహిణి అడగా ఒక బాక్స్ లో ఫుడ్డు ఒక బాక్స్ లో పూలు పూలు తీసుకొస్తుంది అని ఇమ్మానియేల్ అంటాడు. రోహిణి కోపంగా ఈ ఎపిసోడ్ లో నువ్వు ఇప్పటికి మూడు నాలుగు సార్లు, డైలాగ్స్ ఐతే వేస్తున్నావ్ ప్రతిసారి అంటే కష్టం,అని రోహిణి ఎమోషనల్ అవుతుంది. ఇదంతా ప్రోమోలో భాగమైన లేదంటే నిజంగానే జరిగిందా మనకు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కిర్రాక్ బాయ్స్ టీంకు శేఖర్ మాస్టర్, కిలాడి లేడీస్ కు అనసూయ టీం లీడర్స్ గా వ్యవహరిస్తుంటారు. షోలో ఇలాంటివన్నీ కామనే అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
?igsh=ZjFkYzMzMDQzZg==