BigTV English

Sania Mirza : పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సానియా మీర్జా… ఇక మీకు నరకమే అంటూ

Sania Mirza : పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సానియా మీర్జా… ఇక మీకు నరకమే అంటూ

Sania Mirza :  భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పాకిస్తాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్- భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వాతావరణం ఉన్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా పాక్ కి శక్తిమంతమైన సందేశాన్ని ఇచ్చింది. యుద్దానికి సమీపంలో ఉన్న పరిస్తితులో దేశ మద్దతు పై బరువు పెడుతూ సానియా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీల చిత్రాలను పోస్ట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన  తరువాత ఈ సందేశం పోస్ట్ చేయడం విశేషం.


Also Read :  IPL 2025 Postponed: ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా… మళ్ళీ ఎప్పుడంటే

సానియా తన ఇన్ స్టా గ్రామ్  కథనాన్ని.. ముగ్గురితో జర్నలిస్ట్ పే డిసౌజా చేసిన పోస్ట్ ను మళ్లీ షేర్ చేసింది. “ఈ శక్తివంతమైన ఫొటోలోని సందేశం ఒక దేశంగా మనం ఎవరో కచ్చితంగా సంగ్రహిస్తుంది” అని రాసింది. సానియా అత్యంత విజయవంతమైన టెన్నిస్ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ కోర్టుల్లో రెండు దశాబ్దాలకు పైగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. తన మాజీ భర్త షోయబ్ మాలిక్ ద్వారా పాకిస్తాన్ సబంధాలు ఉన్నప్పటికీ.. సానియా భారత్ కి బలమైన మద్దతు ఇస్తూనే ఉంది. ఇక వాస్తవానికి కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా దేశం గర్వించేలా చేశారు.


కల్నల్ సోఫియా ఇండియన్ ఆర్మీ కార్ప్స్ సిగ్నల్స్ అధికారి. ముఖ్యంగా భారత సైన్యంలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ను అనుమతిస్తూ 2020లో సుప్రీంకోర్టు తన కీలక తీర్పులో ఆమెను ప్రశంసించింది. ఆ విషయాన్ని ఆమె గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా వెల్లడించారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్రను,ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంలో గుర్తించడం వంటివి కీలక విషయాలను గుర్తించింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్. వ్యోమికా సింగ్ ఆకాశంలోకి వెళ్లడం తన చిన్న నాటి కోరిక. తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆమె ఆరో తరగతి నుంచే పైలట్ కావాలనుకుందట.  పైలట్ పై ఆమెకు ఉన్న ఆసక్తిని కొనసాగించడానికి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో నమోదు చేసుకుంది.

ఇక  ఆ తరువాత ఇంజినీరింగ్ డిగ్రీ ని పూర్తి చేసింది. సాయుధ దళాల్లో భాగమైన తన కుటుంబంలో మొదటి వ్యక్తి గా నిలిచింది. ఆమె ఇంజినీరింగ్ విద్యా నేపథ్యమే.. ఆమె విమానయాన వృత్తికి మంచి ఆధారమని చెప్పవచ్చు. మరోవైపు సానియా ఈ ఆపరేషన్ కి సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందని.. బాధిత కుటుంబాలతో యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగిపోయేలా పాశవిక దాడికి తెగబడి ఉగ్రవాదులకు రక్త సిందూరంతో సమాధానం ఇచ్చారని.. ఇది సరైన నివాళి అని పేర్కొన్నారు సానియా మీర్జా. మిలిటరీ బ్రీఫింగ్ కి ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×