BigTV English

Kiran Abbavaram : నేను ఫస్ట్ కలిసిన హీరో అల్లరి నరేష్

Kiran Abbavaram : నేను ఫస్ట్ కలిసిన హీరో అల్లరి నరేష్

Kiran Abbavaram : ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా నిలదొక్కుకోవచ్చు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్స్ తో వచ్చిన చాలామంది ఈరోజు నటులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలానే హీరోలుగా కూడా మంచి గుర్తింపును సాధిస్తున్నారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేసినా కూడా తన కెరియర్ లో జరిగిన కొన్ని ఒడిదుడుకులు వలన నేడు ఫామ్ లో లేకుండా అయిపోయాడు. షార్ట్ ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన మరో హీరో కిరణ్ అబ్బవరం. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ నటించిన కిరణ్ రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. సినిమాతోనే రవి కిరణ్ కోలా దర్శకుడుగా పరిచయమయ్యాడు.


ఈ సినిమా తర్వాత తనలో ఉన్న రచయితను కూడా బయటకు తీస్తూ ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాను చేశాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దాదాపు కిరణ్ అబ్బవరం టైం అయిపోయింది అనుకునే తరుణంలో క సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కిరణ్ సినిమా కూడా మంచి మార్కెట్ ఉంది అని ఆ సినిమా ప్రూవ్ చేసింది. రీసెంట్ గా అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు కిరణ్. ఈ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడుతూ నేను ఫస్ట్ కలిసిన హీరో అల్లరి నరేష్. మేము ఒక ట్రిప్ కోసం తలకోన వెళ్ళినప్పుడు అక్కడ దొంగలు బండి సినిమా షూటింగ్ జరుగుతుంది. చాలా మంది పెద్దపెద్ద ఆర్టిస్టులు అంతా అక్కడ ఉన్నారు. అప్పుడు నేను భయం భయంగా అల్లరి నరేష్ గారిని కలిసాను అంటూ గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా తన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకి ఆయన గెస్ట్ గా వచ్చి నన్ను బ్లెస్ చేశారు అంటూ తెలిపాడు.

సుబ్బు దర్శకత్వం వహించిన బచ్చల మల్లి సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. చిత్ర యూనిట్ అంతా కూడా ఈ సినిమా మీద మంచి నమ్మకంతో ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన గమ్యం సినిమాలో గాలి శీను పాత్ర తర్వాత అంతలా గుర్తిండి పోయే పాత్ర బచ్చల మల్లి అంటూ అల్లరి నరేష్ కూడా ఒక సందర్భంలో చెప్పారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో అనేది వేచి చూడాలి. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.


Also Read : Samyuktha: తెలుగు ఆడియన్స్ వైల్డ్ ఫైర్ అంటూ ఎంత చక్కగా మాట్లాడిందో

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×